హనుమాన్ అనే ఒక్క సినిమాతో ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు యంగ్ హీరో తేజ సజ్జా. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి ‘ఓ బేబీ’, ‘జాంబి రెడ్డి’ లాంటి చిన్న సినిమాలతో సోసోగా కనిపించిన అతడి కెరీర్ ‘హనుమాన్’తో రాకెట్ వేగాన్ని అందుకుంది.
‘హనుమాన్’ లాంటి చిత్రాన్ని తేజ క్యారీ చేయగలడా అని ముందు సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. వాటిని పటాపంచలు చేస్తూ హనుమంతు పాత్రను చక్కగా పోషించి ప్రశంసలు అందుకున్నాడు తేజ. ఇండియన్ సినిమాలో హాలీవుడ్ తరహా సూపర్ హీరో పాత్రలు తక్కువే. ఐతే ఇప్పుడు హనుమాన్ మూవీతో తేజ ఒక సూపర్ హీరోగా అవతరించాడు. పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. విశేషం ఏంటంటే.. తన తర్వాతి సినిమాలో కూడా అతను సూపర్ హీరో పాత్రే చేస్తున్నాడు.
‘హనుమాన్’ రిలీజ్‌కు ముందే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో తేజ సజ్జ హీరోగా ఇంకో సినిమా ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇది కూడా సూపర్ హీరో పాత్రతో నడిచే సినిమానేనట. దీనికి ఏదో జపనీస్ టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ‘సూపర్ యోధ’ అనేది కొత్త టైటిల్‌గా చెబుతున్నారు.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సైతం ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడన్నది లేటెస్ట్ అప్‌డేట్. రెండు రోజులుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక మెగా మూవీ అంటూ ఊరిస్తున్నది ఈ చిత్రం గురించే. సోమవారం నాడు ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు.
This post was last modified on April 14, 2024 6:04 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…