రెండు రోజులుగా ఇండియాస్ లార్జెస్ట్ మల్టీప్లెక్స్ ఛైన్ పీవీఆర్‌కు, మలయాళ ఫిలిం ఇండస్ట్రీకి మధ్య పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో ఎక్కడా మలయాళ సినిమాలను ప్రదర్శించట్లేదు. మలయాళ డబ్డ్ వెర్షన్లను సైతం హైదరాబాద్ లాంటి చోట్ల పీవీఆర్ వాళ్లు ఆపేశారు.
మరోవైపు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇకపై తమ కంటెంట్ ఏదీ పీవీఆర్ వాళ్లకు ఇవ్వమని స్పష్టం చేసింది. దీంతో ఇది ఇరు వర్గాలకూ నష్టం చేకూర్చే పరిణామంగా భావించారు. ఐతే శనివారం సాయంత్రం ఈ వివాదం పరిష్కారం అయినట్లు తెలుస్తోంది. పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో తిరిగి మలయాళ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈమేరకు ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది.
థియేటర్లలో వీపీఎఫ్ ఛార్జీలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని.. ఓవైపు థియేటర్లకు రెంట్లు కడుతూ, ఇంకోవైపు వీపీఎఫ్ ఛార్జీలు కూడా భరించాలంటే నిర్మాతలకు చాలా కష్టమవుతుందని.. అందుకే సినిమాల ప్రదర్శనకు చౌకగా ఉండే వేరే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి దాన్నే థియేటర్లలో అమర్చుకోవాలని మలయాళ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. ఇందుకు పీవీఆర్ యాజమాన్యం ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే ఆ మల్టీప్లెక్సుల్లో మలయాళ సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. ఐతే ఇరు వర్గాల మధ్య చర్చల అనంతరం సమస్య పరిష్కారం అయింది. ఐతే మలయాళ ఇండస్ట్రీ కోరినట్లు కొత్త టెక్నాలజీని అమర్చుకోవడానికి పీవీఆర్ వాళ్లు అంగీకరించారా.. లేక పీవీఆర్ దారిలోకే మలయాళ ఇండస్ట్రీ పెద్దలు వచ్చారా అన్నది తెలియదు. మొత్తానికి సమస్య అయితే తాత్కాలికంగా పరిష్కారం అయింది. ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశంతో పాటు నివిన్ పౌలీ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుని ఈ సమస్య వల్ల రెండు రోజులు వసూళ్లు కోల్పోయాయి.
This post was last modified on April 13, 2024 10:46 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…