ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఓ సినిమా బాగా ఆడిందంటే చాలు.. ఇక వరుసగా ఆ తరహాలో సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటారు. ఐతే ఒక జానర్‌ను ఫాలో అయితే ఓకే కానీ.. కాన్సెప్ట్‌ను యాజిటీజ్ దించేస్తేనే సమస్య. అలా చేసినపుడు ముందు వచ్చిన సినిమాతో పోల్చి చూస్తారు. దానికి దీటుగానో, అంతకంటే మెరుగ్గానో ఉంటే ఓకే. కానీ ముందు వచ్చిన సినిమాను ఎంత మాత్రం మ్యాచ్ చేసేలా కొత్త చిత్రం లేకపోతే ప్రేక్షకులు దాన్ని తిప్పికొడతారు.
ఇప్పుడు ‘డియర్’ అనే సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన చిత్రమిది. తెలుగమ్మాయే అయిన తమిళ నటి ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించింది. ఇందులో హీరోయిన్‌కు గురక సమస్య ఉంటుంది. దాని వల్ల హీరో ఎలా ఇబ్బంది పడ్డాడు.. ఇది వారి వివాహ బంధానికే ఎలా సమస్యగా పరిణమించింది అన్నది కథ.
ఐతే సేమ్ కాన్సెప్ట్‌తో ఆల్రెడీ ‘గుడ్ నైట్’ అనే సినిమా వచ్చింది. ‘ట్రూ లవర్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మణికందన్ హీరోగా నటించాడు. మీథా రఘునాథ్ అనే కొత్తమ్మాయి కథానాయిక. అందులో హీరోకు గురక సమస్య ఉంటుంది. దాని వల్ల రోజువారీ జీవితంలో అతను పడే ఇబ్బందులు.. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలను చాలా హృద్యంగా చూపించారా సినిమాలో. మంచి ఫీల్‌తో సాగడంతో పాటు ఎమోషనల్‌గానూ ప్రేక్షకులను కదిలిస్తుందా సినిమా.
ఎంటర్టైన్మెంట్‌కు కూడా అందులో లోటు లేదు. కానీ ‘డియర్’ ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా నిలవదు. ఇటు ఎంటర్టైన్మెంటూ లేక, అటు ఎమోషన్లూ పండక ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందా సినిమా. సేమ్ కాన్సెప్ట్‌తో ముందే ఓ సినిమా వచ్చి హిట్టయినపుడు ‘డియర్’ టీం జాగ్రత్తపడాల్సింది. ఈ సినిమా రిలీజై ఏడాది కావస్తోంది. అది చూశాక సినిమా భిన్నంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాల్సింది. లేదా మొత్తంగా సినిమానే ఆపేసి ఉండాల్సింది. అలా కాకుండా సాధారణంగా తీసి ప్రేక్షకుల మీదికి వదిలేశారు. ఫలితంగా నిట్టూర్పులు తప్పట్లేదు.
This post was last modified on April 13, 2024 2:07 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…