పూరి జగన్నాథ్.. గత రెండు దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో టాప్-5 డైరెక్టర్లలో ఒకడిగా నిలిచే పేరు. ‘పోకిరి’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనుడాయన. ఇంకా ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. ఈ 20 ఏళ్లలో పూరి చేసినన్ని సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాస్త పేరున్న మరే దర్శకుడూ చేసి ఉండడంటే అతిశయోక్తి కాదు.
ఇంత రేంజ్ ఉన్న దర్శకుడు తొలి సినిమా తీయడానికి ముందు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మంది దర్శకుల్లాగే అతడికీ కన్నీటి కథలున్నాయి. ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోకముందే అతను తాను ప్రేమించిన లావణ్యను పెళ్లి చేసుకున్నాడు.
అప్పటికి కనీసం తాళి బొట్టు, పెళ్లి బట్టలు కొనడానికి కూడా పూరి దగ్గర డబ్బుల్లేవట. అలాంటి సమయంలో తనను ఆదుకున్న యాంకర్ ఝాన్సీ, నటి హేమలను ఎన్నటికీ మరిచిపోలేనని అంటున్నాడు పూరి.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో జరిగిందో పూరి వివరించాడు. ‘‘లావణ్యను పెళ్లి చేసుకునే సమయానికి నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదు. అప్పుడు తాళి బొట్టు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో యాంకర్ ఝాన్సీ.. తాళిబొట్టు కొనిపెట్టింది. ఇక హేమ పెళ్లి బట్టలు కొని తెచ్చింది. మిగిలిన నా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వంటివి స్పాన్సర్ చేశారు. నేను ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశాలు అందుకున్నాక బాగా సంపాదించాను. అయితే కొంతమంది స్నేహితులను గుడ్డిగా నమ్మి పోగొట్టుకున్నాను. అయితే నా పెళ్ళికి సాయం చేసిన ఝాన్సీ, హేమ అలాగే నా స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేను” అని పూరి చెప్పుకొచ్చాడు.
తన దగ్గర మేనేజర్‌గా పని చేసిన ఓ వ్యక్తి దారుణంగా మోసం చేయడంతో పూరి ఒక దశలో రోడ్డు మీదికి వచ్చేసిన పరిస్థితి తలెత్తింది. తన ఇల్లు, ఆఫీసు కూడా అమ్మేయాల్సి వచ్చింది. కానీ తర్వాత మళ్లీ కోలుకుని పూర్వపు స్థితికే చేరుకున్నాడు.
This post was last modified on April 27, 2020 1:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…