ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో ఎలాంటి బ్రేక్ ఇస్తుందో ముందే చెప్పడం కష్టం. ఏళ్ళ తరబడి ఎదురు చూసిన వాళ్లకు ఒక్క బ్లాక్ బస్టర్ జాతకం మార్చేస్తుంది. ఒక్క డిజాస్టర్ నిచ్చెన నుంచి కిందకు పడేస్తుంది. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టిలు ఇవాళ ఈ స్టేజిలో ఉన్నారంటే సైడ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టిన వాళ్ళ ప్రయాణంలో ఎన్నో రాళ్లను తట్టుకోవడం వల్లే సాధ్యమయ్యింది. తేజ సజ్జ కూడా ఈ కోవలోకి వచ్చేయబోతున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే హనుమాన్ లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకోవడం మాటలు కాదు. ఇక అసలు పాయింట్ కు వచ్చేద్దాం.
ఇటీవలే ఆహా-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరిగిన సంగతి తెలిసిందే. అది లైవ్ గా టీవీలో వచ్చిన వేడుక కాదు కాబట్టి ఆ విశేషాలు సగటు ప్రేక్షకులకు అందుబాటులోకి రాలేదు. తాజాగా ఓటిటి స్ట్రీమింగ్ మొదలయ్యాక ఆసక్తి గొలిపే సంఘటనలు చోటు చేసుకోవడం బయట పడింది. వాటిలో చిరంజీవి తీసుకొచ్చిన తేజ సజ్జ ప్రస్తావన ఉంది. తనకు ఎప్పటి నుంచో ఇష్ట దైవమైన హనుమంతుడి మీద సినిమా చేయాలని చాలా సార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని, బాల నటుడిగా తన స్ఫూర్తితో వచ్చిన తేజ దాన్ని చేయడం గర్వంగా ఉందని సంతోషాన్ని పంచుకున్నారు.
హనుమాన్ చూశాక ఆ విజయం తనే సాధించినంత ఆనందంగా ఉందని తేజ సజ్జ చూస్తుండగానే స్టేజి మీద చెప్పడంతో చప్పట్లు మారుమ్రోగాయి. నిజమే మరి. ఇంద్ర, చూడాలని ఉంది లాంటి క్లాసిక్స్ లో చిరుతో నటించిన తేజ ఇప్పుడు ఏకంగా ఆయన డ్రీం ప్రాజెక్టునే చేయడం అనూహ్యమే. అయినా మెగాస్టర్ ఆ ముచ్చటని వదిలేయడం లేదు. వసిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభరలో ప్రధాన బ్యాక్ డ్రాప్ హనుమంతుడి మీదే జరుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ విగ్రహం పెట్టడం, దాని ఫోటోలు రావడం చూశాంగా. సో అదన్న మాట అంజనీపుత్రుడి కనెక్షన్.
This post was last modified on April 12, 2024 10:51 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…