Movie News

ఫేక్ హడావిడికి దూరంగా దిల్ రాజు

సముద్రమంత నమ్మకం పెట్టుకుంటే చెరువంత ఫలితాన్ని ఇచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఫలితం నిర్మాత దిల్ రాజుని ఎంత మాత్రం సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపైన్ చేశారని సైబర్ కంప్లైంట్ ఇవ్వడం లాంటి చర్యలు కొందరు అభిమానులు చేశారు కానీ వాటి వల్ల కలెక్షన్లు పెంచలేరన్నది ఓపెన్ సీక్రెట్. వరసగా వస్తున్న సెలవులను టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ వాడుకున్నంతగా ఫ్యామిలీ స్టార్ ఉపయోగించుకోలేదు. మధ్యతరగతి ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడే చాలా మంచి సినిమా తీశామని బలంగా చెప్పుకున్న దిల్ రాజుని ఒక్క విషయంలో మెచ్చుకోక తప్పదు.

ఇది కలెక్షన్లు గొప్పగా చెప్పుకునే హైప్ పెంచుకునే ట్రెండ్. రెండో రోజు నుంచే తమ సినిమాకు ఇన్నేసి కోట్లు వచ్చాయని పోస్టర్లలో పెద్ద పెద్ద నెంబర్లు వేసి పబ్లిసిటీ చేయడం గత కొన్నేళ్లుగా ఎన్నో చూస్తున్నాం. ఇమేజ్ ఉన్న హీరోల అసలు ఫిగర్లకు ఓ పాతిక శాతం దాకా ఫేక్ కలిపేసి తమది బ్లాక్ బస్టరని చాటింపేసుకునే ప్రొడ్యూసర్లకు కొదవ లేదు. ఇలా చేయడం కొంత సానుకూల ఫలితాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. దిల్ రాజు మాత్రం వీటి జోలికి వెళ్ళలేదు. ఏప్రిల్ 5 రిలీజ్ రోజు నుంచి మొదలుపెడితే ఏ దశలోనూ వసూళ్లను హైలైట్ చేస్తూ పోస్టర్ కానీ ప్రమోషన్ కానీ చేయకపోవడం గమనార్హం.

దీని కన్నా దారుణంగా తిరస్కారానికి గురైన సినిమాలు ఎన్నో కనీసం వారం వరకు కలెక్షన్ల హడావిడితో ఎంతో కొంత జనాన్ని మభ్యపెట్టే బాపతులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కానీ దిల్ రాజు మాత్రం పబ్లిక్ రియాక్షన్లు, థియేటర్ నుంచి బయటికొచ్చిన జనాల స్పందనలు మాత్రమే వీడియో రూపంలో ప్రమోట్ చేశారు కానీ ఇన్నేసి కోట్లు అన్నేసి కోట్లని ప్రచారంతో ఊదరగొట్టలేదు. ఇది ఒకరకంగా మంచిదే. సుమారు నలభై అయిదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఫ్యామిలీ స్టార్ ఇంకా సగం దూరం పైనే ప్రయాణం చేయాల్సి ఉంది. రెండో వీకెండ్ మీద బోలెడు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది

This post was last modified on April 12, 2024 6:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

1 hour ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

2 hours ago

అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…

5 hours ago

లోకేష్‌తో సినిమాపై తేల్చేసిన స్టార్ హీరో

కూలీ సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో.. ఎన్ని ఊహాగానాలు…

6 hours ago

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

9 hours ago

అమెరికాలో లోకేష్… టీ-11 కు నిద్ర పట్టట్లేదా?

పెట్టుబ‌డులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమెరికా స‌హా పొరుగున ఉన్న‌…

10 hours ago