ఆగస్ట్ 15 విడుదలని ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని పుష్ప 2 ది రైజ్ టీమ్ పదే పదే స్పష్టం చేస్తున్న తరుణంలో దాని స్థానంలో రావాలని చూస్తున్న ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు మెల్లగా వెనుకడుగు వేస్తున్నాయి. వాటిలో ప్రధానమైంది సింగం అగైన్. అజయ్ దేవగన్ హీరోగా భారీ బడ్జెట్ తో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పోలీస్ మల్టీస్టారర్ షూటింగ్ గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉన్నా ఉత్తరాది మార్కెట్లలో అజయ్ క్రేజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తొలుత భావించారు. కానీ ఇప్పుడు సమీకరణాలన్నీ మారిపోయాయి.
ఇండిపెండెన్స్ డే రేసు నుంచి సింగం అగైన్ తప్పుకోవడం ఖాయమేనని బాలీవుడ్ అప్డేట్. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంకా బోలెడు పనులు పెండింగ్ ఉండటంతో దీపావళికి వెళ్లే దిశగా ప్లానింగ్ మార్పు జరుగుతోందని తెలిసింది. దీనికి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. ఎంత ఖాకీ చొక్కా కథలు తీసినా రోహిత్ శెట్టి ఫైట్లు ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే రేంజ్ లో ఉంటాయి. నమ్మశక్యం కాని రీతిలో యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేసుకుంటాడు. ఈసారి వాటి మోతాదు ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తోందని సమాచారం. మొత్తానికి సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
సో ప్యాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2కున్న ప్రధానమైన అడ్డంకి తొలగినట్టే. మొదటి భాగం తెచ్చిన క్రేజ్ దృష్ట్యా హిందీ నుంచి హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు కెజిఎఫ్ ని మించిన వసూళ్ల సునామిని దీనికి చూడొచ్చని నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ లో అల్లు అర్జున్ గెటప్ చూసి షాక్ తిన్న విశ్లేషకులు ఈ మాస్ కి బాలీవుడ్ జనాలు మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని ఫిక్సయిపోయారు. ఆగస్ట్ 15 పుష్ప 2 వచ్చాక మళ్ళీ చెప్పుకోదగ్గ రిలీజ్ అంటే అదే నెల 29న రిలీజయ్యే నాని సరిపోదా శనివారం మాత్రమే. హిట్ టాక్ వస్తే మాత్రం బన్నీ ఊచకోత మాములుగా ఉండదు.
This post was last modified on April 12, 2024 1:25 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…