టాలీవుడ్ ఎంట్రీ సీతారామంతో డెబ్యూ బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్ ఠాకూర్ కు ఆ తర్వాత హాయ్ నాన్న అంత గొప్పగా కాకపోయినా మంచి వసూళ్లతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసింది. ఇక ది ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ లాంఛనం పూర్తవుతుందనుకుంటే ఇది కాస్తా రివర్స్ అయ్యింది. పండగ పుణ్యమాని ఉగాది రోజు కొంచెం మెరుగ్గా కనిపించినా ఫైనల్ ఫలితం మాత్రం డిజాస్టర్ కు తక్కువ కాకపోవచ్చని ట్రేడ్ భావిస్తోంది. నలభై అయిదు కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఇప్పుడున్న టాక్ కి అసాధ్యమేనని చెప్పాలి. సో మృణాల్ కెరీర్ లో మొదటి తెలుగు ఫ్లాప్ నమోదయ్యింది.
కొంచెం తీక్షణంగా గమనిస్తే ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాల్లో మృణాల్ ఠాకూర్ బాగా డబ్బున్న పాత్రలే చేసింది. సీతారామంలో జమీందార్ వారసురాలిగా దర్పం చూపిస్తే హాయ్ నాన్నలో మధ్యతరగతి నానిని ఇష్టపడే రిచ్ క్లాస్ గర్ల్ గా మెప్పించింది. ది ఫ్యామిలీ స్టార్ లో ఏకంగా వేల కోట్ల ఆస్తులున్న మిలియనీర్ గా దర్శనమిచ్చింది. పదే పదే ఇలాంటి క్యారెక్టర్లే చేయడం వల్ల మాస్ కి దూరమయ్యే రిస్క్ లేకపోలేదు. ఉదాహరణకు రష్మిక మందన్న ఛలో, భీష్మలో ఎంత క్లాస్ గా కనిపించినా పుష్పలో నా సామీ అంటూ ఊర మాస్ గా అదరగొట్టాకే అమాంతం ఫేమ్ పెరిగింది.
తొలుత పూజా హెగ్డే సైతం మృణాల్ లాగే ఓన్లీ రిచ్ గా కనిపించి తర్వాత ఒకే టెంప్లేట్ లా అనిపించడంతో పాటు వరుస పరాజయాలు టాలీవుడ్ ని దూరం చేశాయి. సో ఇలా జరగకుండా ఉండాలంటే మృణాల్ ఠాకూర్ మధ్యతరగతి మహాభారతాల్లో కనిపించాలి. పక్కింటి అమ్మాయి వేషాలకు వచ్చేయాలి. అప్పుడే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం మృణాల్ కొత్తగా ఒప్పుకున్న తెలుగు కమిట్ మెంట్లు లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదు. హను రాఘవపూడి చేయబోయే ప్రభాస్ సినిమాలో తననే తీసుకోవచ్చనే టాక్ వచ్చింది కానీ మళ్ళీ ఈ కాంబో రిపీట్ కాకపోవచ్చు.
This post was last modified on April 10, 2024 6:45 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…