పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ లేని అభిమానం చూపించేవాడు కోన వెంకట్ ఒకప్పుడు. పవన్ తనకు చాలా క్లోజ్ అని.. అతను తన సోల్ మేట్ అని చెప్పేవాడు. ఈ అభిమానం చూసి కోనను పవన్ ఫ్యాన్స్ కూడా ఇష్టపడేవారు. అలాంటిది 2019 ఎన్నిలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని, సాక్షి మీడియా చేసిన ఒక ఇంటర్వ్యూలో పవన్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశాడు కోన వెంకట్. దీంతో అతను పవన్ ఫ్యాన్స్‌కు పెద్ద శత్రువు అయిపోయాడు. అప్పట్నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. అది ఇంకా తగ్గలేదు. అభిమానుల దాడితో పవన్ పేరెత్తడమే మానేశాడు కోన.
ఐతే తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ విడుదల నేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో పవన్ రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కోన.
రాజకీయాల విషయంలో పవన్‌కు తానొక సలహా ఇస్తే.. ఆయన ఎలా రియాక్ట్ అయింది కోన వెల్లడించాడు. ‘‘పవన్ కళ్యాణ్‌కు నేనొక సలహా ఇచ్చాను. నీకెందుకు రాజకీయాలు? అసలే ఇంట్రావర్ట్‌వి, మనిషి సెన్సిటివ్. ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడు అవసరమా నీకు అని.. దానికి పవన్ ‘నీ ఒపీనియన్ మడిచి నీ దగ్గరే పెట్టుకో అన్నాడు’’ అని కోన తెలిపాడు. ఈ కామెంట్ ఇప్పుడు పవన్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.
ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడు అన్న కోన కూడా.. పవన్‌ను అన్నవాడే అని.. అందుకే ఒపీనియన్ మడిచి పెట్టుకోమని పవన్ అతడికి బాగానే గడ్డి పెట్టాడని.. సోల్‌మేట్ అన్న వ్యక్తే స్వార్థంతో విమర్శలు చేసినపుడు.. మిగతా వాళ్లు విమర్శించకుండా ఉంటారా.. అలాంటివి పట్టించుకుని రాజకీయాలు మానేయాలా అంటూ కోనకు కౌంటర్లు ఇస్తున్నారు ఫ్యాన్స్.