Movie News

డిజాస్టర్ సినిమా పాట – యువ క్రికెటర్ కు స్ఫూర్తి

ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ తరఫున అదరగొడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. విశాఖపట్నంకు చెందిన ఈ టాలెంటెడ్ క్రికెటర్ సత్తా ఏంటో ఈ సీజన్ లో తెలిసొచ్చింది. నిన్నటి ఇన్నింగ్స్ లో అతను చేసిన పరుగులు, కొట్టిన సిక్సులు, బౌండరీల గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకల్ ఫ్రాంచైజ్ కే ఇంత అద్భుతంగా ఆడుతున్న వాడు ఇండియన్ టీమ్ లో అడుగు పెడితే ఎలాంటి రికార్డులు పెడతాడోనని అభిమానులు అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ఇతనికి పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమా పాటకు లింక్ ఏంటో చూద్దాం.

నితీష్ కుమార్ రెడ్డి మ్యాచుకు ముందు ప్రతిసారి వినే పాట జానీలో నారాజు కాకురా మా అన్నయ్యా. రమణ గోగుల స్వరకల్పనలో మంచి హుషారైన బీట్ తో సాగే సాంగ్ ఆ సినిమాలో ఇదొక్కటే. విన్న ప్రతిసారి తనకు కిక్ ఇస్తుందని, ఆ వైబ్రేషన్ ని ఫీలవుతూ గ్రౌండ్ లో అడుగు పెడితే సంతోషంగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది. మత సామరస్యం గొప్పదనం గురించి చెబుతూ మాస్టర్జీ సమకూర్చిన సాహిత్యం ఇప్పటికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రంగబలిలో నాగ శౌర్య కోరిమరీ ఈ పాటను వాడుకుని అచ్చం పవన్ లాగే స్టెప్స్ వేశాడు.

ఒక ఫ్లాప్ మూవీ నుంచి సైతం ఎలా ఇన్స్ పిరేషన్ వస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జానీ ఫలితం ఎలా ఉన్నా దాన్ని కల్ట్ క్లాసిక్ గా భావించే అభిమానులకు కొదవలేదు. స్వీయ దర్శకత్వంలో పవన్ స్టంట్స్ కంపోజ్ చేసుకున్న ఈ ఎమోషనల్ యాక్షన్ మూవీలో డ్రామాని తగ్గించి కమర్షియల్ ఎలిమెంట్స్ పెంచి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని ఫీలవుతూ ఉంటారు. గీతాంజలి తరహా బ్యాక్ డ్రాప్ కి మార్షల్ ఆర్ట్స్ కి మిక్స్ చేయబోయే ఆర్ట్ ఫిలిం మేకింగ్ చేసిన పవన్ డిజాస్టర్ చవి చూడాల్సి వచ్చింది. అయితేనేం తన మ్యూజిక్ టేస్ట్ ఇప్పటికీ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవడం విశేషం.

This post was last modified on April 10, 2024 11:23 am

Share

Recent Posts

సీన్ నుంచి నేర్చుకోవాల్సింది స్క్రీన్‌ప్లేనే

పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి, సూపర్ సక్సెస్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతున్న సీన్ వసూళ్లు చాలా స్టడీగా…

21 minutes ago

ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా కంపెనీలను టచ్ చెయ్యలేదు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విఠలాచార్య సినిమాలో మాదిరిగా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందదు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రకరకాల వ్యాపారాలు,…

55 minutes ago

ఓజి నామస్మరణకు బ్రేక్ ఇస్తే బెటర్

ఈ మధ్య తమన్ తరచుగా తెస్తున్న ప్రస్తావన ఓజి 2. తాజాగా ఇంకో అడుగు ముందుకు వేసి ఓజి 3…

1 hour ago

శర్వానంద్‌కు ఎక్కడ ఖాళీ ఉంది?

తన ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు…

2 hours ago

అలా జరగకూడదు చిరు

విశ్వంభర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్ట్ ప్రవీణ్ నిన్న షేర్ చేసిన ఫోటో వైరలయ్యింది. ఇంకోవైపు కొత్త ట్రైలర్ సిద్ధమయ్యిందని…

2 hours ago

పాదయాత్ర ఒకటే సరిపోదు జగన్

వైసీపీ నేత‌ల నోటి నుంచి వినిపిస్తున్న ఏకైక మాట పాద‌యాత్ర‌. వ‌చ్చే ఏడాదిలో జ‌గ‌న్ 2.0 పేరుతో పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నార‌న్న‌ది…

3 hours ago