గత రెండు మూడు పర్యాయాలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఎంత హడావుడి నడిచిందో తెలిసిందే. కొన్నేళ్ల కిందట ‘మా’ అధ్యక్షులుగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీకి దిగినపుడు.. అవి సాధారణ ఎన్నికలను గుర్తు చేశాయి. ప్రచార హోరు.. పరస్పర విమర్శలు, ఆరోపణలు చూసి అందరూ షాకయ్యారు. నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు కూడా కొంత హడావుడి నడిచింది. ఇక గత పర్యాయం అయితే మా ఎన్నికలు ఒక రణరంగాన్నే తలపించాయి.
మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య పోరు సాధారణ ఎన్నికలను మించిపోయింది. వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో ‘మా’ ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరుకుంది. చివరికి ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలవగా.. ఫలితాల అనంతరం కూడా వివాదాలు కొనసాగాయి. ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు ‘మా’కు దూరం కావడం చర్చనీయాంశం అయింది.
కట్ చేస్తే ‘మా’ గత కార్యవర్గం పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు మళ్లీ ‘మా’ ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం వచ్చింది. కానీ ఎన్నికల పట్ల ఎవరికీ ఆసక్తి లేదు. విష్ణు ప్యానెల్ మీద పోటీకి అవతల వర్గం సిద్ధంగా లేదు. గత ఎన్నికలతోనే ‘మా’కు పూర్తిగా దూరం అయిన ప్రకాష్ రాజ్, ఆయన వర్గం ఇప్పుడు పోటీకి ఎంతమాత్రం సుముఖంగా లేదు. అలా అని వేరే వాళ్లు కూడా ఎవరూ విష్ణు మీద పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. మొత్తంగా అందరికీ ‘మా’ ఎన్నికల మీద ఆసక్తి పోయినట్లుంది.
తాజాగా ‘మా’ సభ్యులు సమావేశం నిర్వహించి ఎన్నికలు అవసరం లేదని.. ప్రస్తుత ప్యానెల్‌నే కొనసాగించాలని నిర్ణయించారు. ‘మా’కు భవనం కట్టే వరకు మంచు విష్ణునే అధ్యక్షుడిగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ వ్యవహారం పెద్దగా హడావుడి లేకుండా ముగిసిపోయింది. గత పర్యాయం ‘మా’ ఎన్నికల విషయంలో జరిగిన గొడవను చూసి.. ఇప్పుడింత స్తబ్దుగా ఎన్నికలే లేకుండా మళ్లీ విష్ణునే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల అవాక్కవుతున్నారు జనాలు.
This post was last modified on April 9, 2024 9:49 pm
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…