Movie News

ఫ్యామిలీ స్టార్.. సగం కూడా కష్టమే

ఇక సందేహాలేమీ లేవు. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ జమ అయినట్లే. మొదలైనపుడు.. రిలీజ్‌కు ముందు ప్రామిసింగ్‌గా కనిపించిన ‘ఫ్యామిలీ స్టార్’ చివరికి ఎవ్వరూ ఊహించనంత పెద్ద డిజాస్టర్‌గా నిలవబోతోంది. తొలి రోజు కొంచెం సందడి చేశాక రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత పెద్దగా పుంజుకోలేదు.

ఆదివారం ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. సోమవారం పూర్తిగా చల్లబడిపోయింది. ఆక్యుపెన్సీలు 20 శాతానికి మించలేదు. ఉగాది సెలవును కూడా ఈ సినిమా పెద్దగా ఉపయోగించుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. ముందు వారం వచ్చిన ‘టిల్లు స్క్వేర్’యే బాక్సాఫీస్ లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంది. కొత్త సినిమా కంటే పాతదే బెటర్ అని జనం దానికే వెళ్తున్నారు. మలయాళ అనువాద చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’కు కూడా స్పందన బాగానే ఉంది.

ఎటొచ్చీ ‘ఫ్యామిలీ స్టార్’ పరిస్థితే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇక బుధవారం నుంచి ఈ సినిమాకు షేర్ అంటూ ఏమీ రాదనే భావిస్తున్నారు. ఈ రోజు వచ్చే కలెక్షన్లే ఫైనల్ అనుకోవాలి. ఫ్యామిలీ స్టార్’ ఫుల్ రన్ వరల్డ్ వైడ్ షేర్ రూ.15 కోట్లకు మించకపోవచ్చు.

ఈ సినిమా థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.40 కోట్లు కావడం గమనార్హం. అంటే రాబట్టాల్సినదాంట్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేదన్నమాట. దీన్ని బట్టే సినిమా ఎంత పెద్ద ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో నిర్మాత దిల్ రాజే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. మిగతా ఏరియాల్లో మంచి రేట్లకు సినిమాను అమ్మారు. ఎక్కువగా ఆయన రెగ్యులర్ బయ్యర్లే సినిమాను కొన్నారు. కానీ అందరినీ నష్టాలు ఏదో రకంగా సెటిల్ చేయాల్సిందే.

This post was last modified on April 9, 2024 6:09 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago