Movie News

మహాప్రభో.. థియేటర్లు తెరవండి

లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయకముందే, కరోనా విజృంభణ కొనసాగుతుండగానే కొన్ని నెలల కిందటే వైన్ షాపులు తెరుచుకోవడానికి అనుమతులిచ్చేసింది ప్రభుత్వం. ఆ సందర్భంగా మద్యం దుకాణాల ముందు జనాలు వందల సంఖ్యలో ఎలా నిలబడ్డారో.. ఒకరి మీద ఒకరు పడి ఎలా తోసుకున్నారో అందరూ చూశారు. రోజులు గడిచేకొద్దీ అన్ని చోట్లా షరతులు తొలగిపోయాయి.

జనాలు ఏ పరిమితులూ లేకుండా తిరిగేస్తున్నారు. మార్కెట్లకు పోతున్నారు. షాపింగులు చేస్తున్నారు. విహారాలకు వెళ్తున్నారు. ఇలా అన్నింటికీ అనుమతులు వచ్చాయి. అన్ని చోట్లా జనాలు కనిపిస్తున్నారు. కానీ థియేటర్లకు మాత్రం ఎంతకీ మోక్షం కలగట్లేదు. ఇంతమందిని కరుణించి మాపై మాత్రం ఎందుకీ వివక్ష అని థియేటర్ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్లు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం.

ఒక షాపింగ్ మాల్‌లో కింద వందల మంది జనాలు తిరుగుతూ ఉండి.. పైగా థియేటర్లు మాత్రం మూత వేసి ఉండటం విడ్డూరమే. నియంత్రిస్తే అన్నింటినీ నియంత్రించాలి. కానీ ఇలా థియేటర్లను మాత్రం కట్టడి చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిశ్రమను నమ్ముకున్న లక్షలాది మంది ఆరు నెలలకు పైగా ఆదాయం లేక పస్తులుంటున్నారు. తాజాగా ప్రసాద్ ఐమాక్స్ లాంటి పేరున్న సంస్థలో థియేటర్ ఆపరేటర్‌గా పని చేసే వ్యక్తి జీతం రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి సింగిల్ స్క్రీన్లను నమ్ముకున్న లక్షలాది మంది పరిస్థితి ఏంటి?

థియేటర్లను తెరిచినా వెంటనే జనం ఎగబడే పరిస్థితి ఎంతమాత్రం లేదు. సోషల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాటు చేయడం అనివార్యం. ఇతర నిబంధనలు కూడా పాటించాల్సిందే. కాబట్టి పూర్తి స్థాయిలో ఆదాయం రాదు. కనీసం మెయింటైనెన్స్ ఖర్చులైనా వచ్చి.. థియేటర్లలో పని చేసే సిబ్బంది కడుపులైనా నిండుతాయి. ఎంత పెద్ద సంస్థ అయినా ఎన్ని నెలలని ఆదాయం లేకుండా చేతి నుంచి జీతాలు ఇస్తుంది? ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్రం కరుణించి థియేటర్లకు మోక్షం కల్పించాలని వాటిని నమ్ముకున్న అభాగ్యులు అభ్యర్థిస్తున్నారు.

This post was last modified on September 15, 2020 1:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

10 mins ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

17 mins ago

వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా…

20 mins ago

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

1 hour ago

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

3 hours ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

3 hours ago