గత ఏడాది ‘సామజవరగమన’తో కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు శ్రీ విష్ణు. ఇటీవలే అతడి నుంచి వచ్చిన ‘ఓం భీం బుష్’ ఓ మాదిరిగా ఆడింది. ఆల్రెడీ రెండు మూడు చిత్రాలు చేతిలో ఉండగా… కొత్తగా ఇంకో సినిమాను మొదలుపెట్టాడు విష్ణు. ఉగాది రోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీ విష్ణుకిది హీరోగా 19వ సినిమా. జానకి రామ్ మారెళ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
ఈ సినిమాను మూడు బేనర్లు కలిసి నిర్మిస్తుండడం విశేషం. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, విజిల్ వర్తీ ఫిలిమ్స్ అనే రెండు కొత్త సంస్థలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యాయి. దీంతో పాటుగా కోన వెంకట్ సంస్థ ‘కోన వెంకట్ ఫిలిమ్ కార్పొరేషన్ కూడా ఈ చిత్రంలో పార్ట్‌నరే.
కోన వెంకట్‌తో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లి కూడా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. కామెడీ సినిమాలు శ్రీ విష్ణుకు బాగా కలిసొస్తున్న నేపథ్యంలో అదే జానర్లో ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. ‘సామజవరగమన’తో మంచి పేరు సంపాదించిన రచయితలు భాను భోగవరపు, నందు సవిరగన ఈ చిత్రానికి కూడా రచన అందిస్తుండడం విశేషం.
‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చనుండగా.. సాయి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు చూసుకుంటాడు. శ్రీ విష్ణు ప్రస్తుతం పీపుల్స్ మీడియా బేనర్లో ‘స్వాగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ దర్శకుడు హాసిత్ గోలి రూపొందిస్తున్న చిత్రమిది. ఇది కాక రెండు ప్రాజెక్టులు అతడి చేతిలో ఉన్నాయి.
This post was last modified on April 9, 2024 5:38 pm
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…