Movie News

శ్రీలీల పోయె.. భాగ్యశ్రీ వచ్చె

‘ఫ్యామిలీ స్టార్’తో మరో ఎదురు దెబ్బ తిన్నాడు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ‘లైగర్’ అతడికి దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. దానికి ముందు, తర్వాత కూడా సరైన ఫలితాలు రాలేదు. ‘ఖుషి’ కూడా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ‘ఫ్యామిలీ స్టార్’తో అయినా రాత మారుతుందని అనుకుంటే.. అది కూడా తీవ్ర నిరాశనే మిగులుస్తోంది. ఇక ఈ సినిమా సంగతి వదిలేసి తర్వాతి చిత్రం మీద దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు విజయ్.

ఈ చిత్రానికి ముందు కథానాయికగా అనుకున్నది శ్రీలీలను. ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలుకాకపోవడం, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్‌గా నటించాల్సి ఉండడంతో శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి.

కారణాలేవైనప్పటికీ శ్రీలీల అయితే ఈ ప్రాజెక్టులో లేదు. త్వరలో సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా హీరోయిన్ వేట గట్టిగానే సాగుతోంది. ఒక దశలో ‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు పేరును కూడా పరిశీలించారట. కానీ చివరికి ‘మిస్టర్ బచ్చన్’తో మాస్ రాజా రవితేజతో జత కడుతున్న ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేను ఈ చిత్రంలో కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. విజయ్ పక్కన భాగ్యశ్రీ బాగా సూటవుతుందని భావిస్తున్నారు.

‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే. కానీ దాని హిందీ వెర్షన్ ఫ్లాప్ అయింది. తర్వాత రామ్ చరణ్‌తో ఓ సినిమా అనుకున్నాడు కానీ.. వర్కవుట్ కాలేదు. చివరికి విజయ్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది.

This post was last modified on April 9, 2024 5:36 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

27 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago