Movie News

కన్నప్ప క్యాస్టింగ్ చూస్తే మైండ్ బ్లాంకే

మంచు విష్ణు హీరోగా తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీస్టారర్ కన్నప్పలో క్యాస్టింగ్ అంతకంతా పెరుగుతూ పోతోంది. నిజానికి ఇంత పెద్ద తారాగణం అవసరమయ్యేంత స్కోప్ అందులో ఏముందో తెలియాలంటే ఒకటి పుస్తకం చదవాలి లేదా కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప సినిమా చూడాలి. ఈ లెక్కన చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి పాత్రకు ఇమేజ్ ఉన్న స్టార్ నటీనటులను తీసుకోవడం ద్వారా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ రీచ్ రావాలి, బడ్జెట్ లెక్కల్లో వర్కౌట్ అవ్వాలంటే ఈ స్ట్రాటజీనే కరెక్ట్.

ముందుగా చెప్పుకునే స్టార్ అట్రాక్షన్ ప్రభాసని వేరే చెప్పనక్కర్లేదు. శివుడిగా కనిపించేది కాసేపే అయినా చాలా పవర్ ఫుల్ గా క్లైమాక్స్ ఎపిసోడ్ డిజైన్ చేసినట్టు సమాచారం. పార్వతిగా నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు ఏ క్యారెక్టర్లు చేస్తున్నది ఇంకా తెలియలేదు. బ్రహ్మానందం, కౌశల్ మందా లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ చాలానే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేరబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ముందు నుంచి కన్నప్ప గురించి వస్తున్న లీకులన్నీ దాదాపు నిజమైనవే ఎక్కువ.

శివరాత్రికి వదిలిన ప్రీ లుక్ పోస్టర్ తప్ప కన్నప్పకు సంబంధించి ఇంకా ప్రమోషన్లు మొదలుకాలేదు. ఈ ఏడాది విడుదల సాధ్యం కాకపోవచ్చట. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ కు ఎక్కువ సమయం అవసరం ఉండటంతో 2025 ప్రథమార్థంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇతిహాస గాథకు టాలీవుడ్ టీమ్ తో పాటు పలువురు అంతర్జాతీయ నిపుణులు పని చేస్తున్నారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచు విష్ణుకి నటన, మేకింగ్ రెండింట్లోనూ ఛాలెంజ్ గా నిలుస్తున్న కన్నప్ప మీద మంచు ఫ్యామిలీ గట్టి నమ్మకం పెట్టుకుంది.

This post was last modified on April 8, 2024 9:31 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

6 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

10 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

12 hours ago