ఇటీవలే విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తెలిశాక కూడా నిర్మాత దిల్ రాజు పట్టువదలని విక్రమార్కుడిలా నిన్నటి వరకు ప్రమోషన్ల పడవని లాగుతూనే ఉన్నారు. సినిమా మీద ఎవరో ఒక వర్గం కావాలని నెగటివ్ క్యాంపైన్ చేస్తున్నారని కొన్ని ఆధారాలతో ఫ్యాన్స్ సభ్యులు ఆల్రెడీ సైబర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చేశారు. దీని వల్ల ఒనగూరేది ఏమి లేదని అందరికీ తెలుసు. సోషల్ మీడియా ట్రెండ్స్ ఇలాంటి ఫిర్యాదులకు జడిసేవి కాదు. వీటి సంగతి పక్కనపెడితే అసలు విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 నుంచి ఎక్కడ యాక్టివ్ గా కనిపించకపోవడం దేనికి సంకేతమని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏవో కారణాల వల్ల తను ఇండియాలో లేడు. సరే సమస్య లేదు. కానీ ట్విట్టర్ లో అందుబాటులో ఉండటానికి దేశంతో సంబంధం లేదు. అమెరికాలో ఉన్నా దుబాయ్ లో ఉన్నా మన భావాలను పంచుకోవచ్చు. కానీ ఫ్యామిలీ స్టార్ కోసం ఏప్రిల్ 2న దిల్ రాజు, మృణాల్ ఠాకూర్ తో గ్రూప్ ఫోటోలు షేర్ చేశాక విజయ్ వైపు నుంచి ఎలాంటి యాక్టివిటీ లేదు. మూడు రోజుల క్రితం ఫ్యామిలీ స్టార్ రిలీజ్ రోజు సందర్భంగా నాన్నకు విషెస్ చెప్పాడు అంతే. అంటే రిజల్ట్ వచ్చేసి తనకు అర్థమైపోయింది కాబట్టి మౌనంగా ఉన్నాడనుకోవాలా లేక నిజంగానే అంత బిజీగా ఉండి కొత్త రిలీజుని మర్చిపోయాడా అనేదే ప్రశ్న.
హిట్టయినా ఫ్లాపయినా ఓ వారం రోజుల పాటు తమ సినిమా గురించి కాసింత గొప్పగా చెప్పుకోవడం అందరూ చేసేదే. కానీ విజయ్ దేవరకొండ వాటికి దూరంగా ఉన్నాడు. ఒకపక్క దిల్ రాజు బ్రహ్మాండమైన మంచి సినిమా తీశామని పదే పదే చెబుతున్నాడు. ఆ వీడియోలనో లేదా ట్వీట్లను రీ షేర్ చేయడం ద్వారా ట్విట్టర్ లో 3.4 మిలియన్లు, ఇన్స్టా లో 21.6 మిలియన్ల ఫాలోయర్లున్న విజయ్ దేవరకొండ మరికొందరికి సినిమాని రీచ్ చేయొచ్చు. అలా కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలకు పరిమితమై విడుదలయ్యాక ఇంత సైలెంట్ గా ఉండటం దేనికి సంకేతమో మరి.
This post was last modified on April 8, 2024 9:32 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…