సినిమా సమీక్షల మీద ఇండస్ట్రీ నుంచి నిరసన వ్యక్తం కావడం కొత్తేమీ కాదు. సినిమాకు టాక్ బాలేక, కలెక్షన్ల విషయంలో ఇబ్బంది పడుతున్నపుడు అసహనంతో టీం సభ్యులు రివ్యూలను తప్పుబట్టడం చాలా కాలం నుంచి జరుగుతున్నదే. ఇప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం ఈ జాబితాలో చేరారు. తన ప్రొడక్షన్లో వచ్చిన కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్‌కు పూర్తిగా నెగెటివ్ టాక్ రావడం.. తొలి రోజు పర్వాలేదనిపించిన ఈ సినిమాకు రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ కావడంతో రాజు హర్టయినట్లున్నారు. రిలీజ్ రోజు రివ్యూలను తాను అంగీకరిస్తానని.. కానీ రివ్యూలతో పోలిస్తే పబ్లిక్ టాక్ చాలా బాగుందని సానుకూల ధోరణిలో మాట్లాడిన రాజు.. తర్వాత స్వరం మార్చారు.
సినిమా సమీక్షలను మూడు రోజుల పాటు ఆపాల్సిన అవసరం ఉందని తాజాగా రాజు అభిప్రాయపడ్డారు. కేరళలో మూడు రోజుల పాటు సినిమా సమీక్షలు ఆపాలంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కడం, ఆ విషయంలో కోర్టు సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఉటంకిస్తూ.. మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. అలా చేస్తే తప్ప ఇండస్ట్రీ బాగుపడదని.. రివ్యూలు సినిమాల ఫలితాల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
సమీక్షల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని.. నెగెటివిటీ స్ప్రెడ్ చేసి సినిమాను దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. సినిమా మీద ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చని.. అది వారి వ్యక్తిగతమని.. కానీ ప్రేక్షకుల మీద ఆ అభిప్రాయాన్ని రుద్ది థియేటర్లకు రాకుండా చేయడం కరెక్ట్ కాదని రాజు చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిర్మాతలు ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని.. సినిమాలు తీయడం ఎందుకులే అని ఊరుకుంటారని.. అప్పుడు ఇండస్ట్రీకే నష్టమని రాజు అభిప్రాయపడ్డారు.
This post was last modified on April 8, 2024 10:07 am
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…