ఇవాళ అక్కినేని అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. యువి క్రియేషన్స్ కొత్త దర్శకుడు అనిల్ ని పరిచయం చేస్తూ నిర్మించబోయే ప్యాన్ ఇండియా మూవీకి ఎప్పుడో కథ ఓకే అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ కూడా వేగంగా చేశారు. కానీ ఎందుకో అడుగులు ముందుకు పడటం లేదు. ప్రాజెక్టు ఆన్ లోనే ఉంది కానీ మొదలుపెట్టే దిశగా చర్యలు తీసుకోలేదు. ఇవాళ సదరు సంస్థ బర్త్ డే విషెస్ చెబుతూ ఒక పాత అఖిల్ స్టిల్ తో పోస్టర్ వదిలారు కానీ అంతకు మించి ఎలాంటి ప్రత్యేకత దాంట్లో లేదు.
ఏజెంట్ డిజాస్టర్ ప్రభావం అఖిల్ నిర్ణయాల మీదే కాదు మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అందుకే పది నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చినా లెక్క చేయలేదు. ఇంకోవైపు ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేస్తున్నా సరే తొందరపడటం లేదు. యువి ప్రస్తుతం విశ్వంభరని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోంది. రెండు పాటలు, కొంత కీలక టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ఇరవై రోజుల ఇంటర్వెల్ ఎపిసోడ్ ని హైదరాబాద్ లోనే తీస్తోంది. ఇంత వేగం గతంలో యువి ఎప్పుడు చూపించలేదు. దర్శకుడు వశిష్ట, హీరో చిరంజీవి దీని మీదే డే అండ్ నైట్ వర్క్ చేస్తూ పరుగులు పెడుతున్నారు.
ఈ కారణంగానే అఖిల్ 6కి జాప్యం తప్పలేదనే టాక్ వినిపిస్తోంది. పైగా గత నెల గామి, ఓం భీమ్ బుష్ తాలూకు బిజినెస్ వ్యవహారాలు, అనుష్క క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఘాటి పనులు ఇలా చాలా వ్యవహారాల్లో యువి మేకర్స్ బిజీగా ఉన్నారు. పైగా అనిల్ చెప్పిన స్టోరీ భారీ బడ్జెట్ ని డిమాండ్ చేయడంతో కొంత తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్ళిపోయిన అఖిల్ ఏమైనా గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి సడన్ సర్ప్రైజ్ లాగా సాయంత్రం లోపు ఏమైనా కానుక ఇస్తారేమో చూడాలి. కానీ డౌటే.
This post was last modified on April 8, 2024 9:38 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…