మామూలుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సంక్రాంతికి ఒక వారం పాటు మోత మోగిపోతుంటుంది. ఆ తర్వాత ఎక్కువ సందడి ఉండేది వేసవిలోనే. కానీ గత ఏడాది, అలాగే ఈ సంవత్సరం వేసవిలో పెద్ద సినిమాల సందడి ఆశించిన స్థాయిలో లేదు. ఐతే ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెద్ద సినిమాల హంగామా ఒక రేంజిలో ఉండబోతోంది. ముఖ్యంగా సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు చివరి వరకు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ కాబోతోంది.
సెప్టెంబరు చివరి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ రానున్న సంగతి తెలిసిందే. నిర్మాత డీవీవీ దానయ్య తాజాగా మరోసారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇక అక్టోబరు రెండో వారంలో బాక్సాఫీస్ షేక్ అయ్యే సినిమాలు రాబోతున్నాయి.
అక్టోబరు 10కి ఆల్రెడీ పాన్ఇండియా మూవీ దేవర షెడ్యూల్ అయి ఉంది. అదే వారం సూర్య సినిమా కంగువను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే మూవీనే. మరోవైపు నాగచైతన్య సినిమా తండేల్‌కు కూడా అక్టోబరు రెండో వారాన్నే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దేవర, కంగువ రెండూ రెండో వారమే వస్తే తండేల్‌ను తర్వాతి వారం రిలీజ్ చేస్తారు. రామ్ చరణ్-శంకర్‌ల క్రేజీ మూవీ గేమ్ చేంజర్‌ను కూడా అక్టోబరులోనే రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది చివరి వారంలో వస్తుందని సమాచారం.
తాజాగా అక్టోబరు రేసులోకి మరో పెద్ద చిత్రం వచ్చింది. అదే.. రజినీకంత్ మూవీ వేట్టయాన్. ఆ సినిమాను అక్టోబరు చివరి రెండు వారాల్లో ఏదో ఒక డేట్‌కు రిలీజ్ చేస్తారట. మొత్తానికి సెప్టెంబరు చివర్నుంచి అక్టోబరు చివరి వరకు నెల రోజుల పాటు సందడే సందడన్నమాట.
This post was last modified on April 8, 2024 9:34 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…