లెజెండ్ తర్వాత జగపతిబాబు కెరీర్ ఎంత గొప్ప మలుపు తిరిగిందో తెలిసిందే. ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. చేసే ప్రతి పాత్రకూ మంచి పారితోషకమూ అందింది. కానీ తనకు ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల విసుగొచ్చేసిందని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రలు అని చెప్పుకోదగ్గవి ఐదారుకు మించి లేవని ఆయన తరచుగా బాధ పడుతుంటారు. తన పాత్రలు, వాటి లుక్స్ ఒకేలా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.
రంగస్థలం, అరవింద సమేత లాంటి సినిమాల్లో పాత్రల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్‌లోనూ అలవాటైన రిచ్ డాడ్ పాత్రలోనే కనిపించిన జగపతిబాబు.. రాబోయే ఓ కొత్త సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి జగపతిబాబు లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. అరవింద సమేత తరహా రగ్డ్ క్యారెక్టర్లా కనిపిస్తోందిది. జగపతిబాబు లుక్.. డ్రెస్సింగ్.. మొత్తంగా ఆయన ఆహార్యం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. ఇది నెగెటివ్ రోలే అయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జగపతిబాబు ఇలాంటి డిఫరెంట్ లుక్, క్యారెక్టరైజేషనే కోరుకుంటారు. పాత్ర కొత్తగా ఉంటే పారితోషకం కూడా తగ్గించుకుని నటించడానికి తాను రెడీ అని అంటుంటారు జగపతి. మరి ఆయన ఆకలి తీర్చే పాత్రే హరీష్ శంకర్ ఇచ్చి ఉంటాడేమో చూడాలి. బాలీవుడ్ మూవీ రైడ్‌కు ఇది తెలుగు అడాప్షన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates