Movie News

ఆ సంస్థను నిలబెడుతున్న హీరో

సితార ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్స్ బేనర్లలో ఒకటి. హారిక హాసిని బేనర్ మీద తన బాబాయి రాధాకృష్ణతో కలిసి ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. ఇంకోవైపు ఈ సంస్థలో మిడ్ రేంజ్ మూవీస్ తీస్తుంటాడు సూర్యదేవర నాగవంశీ. ఐతే ఈ రెండు సంస్థలకు కొంత కాలంగా పెద్దగా కలిసి రావడం లేదు. సక్సెస్ రేట్ బాగా పడిపోయింది.

హారిక హాసిని బేనర్లో ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాత.. ‘గుంటూరు కారం’ తీస్తే తేడా కొట్టింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అని టీం ప్రచారం చేసుకున్నప్పటికీ.. వాస్తవానికి ఈ సినిమాను కొన్న బయ్యర్లెవ్వరూ లాభాలు అందుకోలేదు.

ఇక సితార సంస్థ విషయానికి వస్తే.. ఈ సంస్థలో ప్రొడ్యూస్ చేసిన అత్యంత పెద్ద సినిమా ‘భీమ్లా నాయక్’ కొంత మేర నష్టాలే మిగిల్చింది. ఇక గత కొన్నేళ్లలో ఈ బేనర్లో హిందీ జెర్సీ, స్వాతిముత్యం, బుట్టబొమ్మ, ఆదికేశవ లాంటి ఫెయిల్యూర్ మూవీస్ వచ్చాయి.

సర్, మ్యాడ్ సినిమాలు సితారకు ఓ మోస్తరు లాభాలు అందించాయి. ఐతే ఈ సంస్థకు లాభాల పంట పండించింది మాత్రం సిద్ధు జొన్నలగడ్డనే. అతను హీరోగా సితార సంస్థలో తెరకెక్కిన తొలి చిత్రం ‘డీజే టిల్లు’ రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయింది. సిద్ధుకు స్టార్ ఇమేజ్ లేని టైంలో తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమా.. పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్ల లాభాలు అందించింది.

ఇక రెండేళ్ల తర్వాత ఇప్పుడొచ్చిన దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ ఇంకా పెద్ద హిట్టయింది. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ సినిమా రన్ ఇంకా చాలా రోజులు కొనసాగేలా ఉంది. దీని ప్రొడక్షన్ కాస్ట్ పది కోట్లే. సిద్ధుకు లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉంది. ఎలా చూసినా సినిమా మీద సితార సంస్థకు రూ.30 కోట్లు తక్కువ కాకుండా లాభం వస్తుందని అంచనా. సిద్ధు సినిమాలను పక్కన పెట్టి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సితార సంస్థ పుట్టి మునిగేదే. ఒక రకంగా ఆ సంస్థను నిలబెడుతున్నది సిద్ధు జొన్నలగడ్డ అనే చెప్పాలి.

This post was last modified on April 7, 2024 4:43 pm

Share

Recent Posts

హనుమంతరావు మాటలకు బాధపడ్డ బాబు

“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి…

12 minutes ago

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…

3 hours ago

మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…

3 hours ago

సినిమా కోసం కాలేజీకి సెలవా?

కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…

3 hours ago

‘హనుమాన్’ను ఇబ్బందిపెట్టడంపై మహేష్ కోప్పడ్డాడా?

2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న…

4 hours ago

హను పనితనం మీద ఇన్ని కామెంట్లా

టాలీవుడ్ దర్శకుల్లో వివాదాలకు దూరంగా కాసింత ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి…

5 hours ago