ది ఫ్యామిలీ స్టార్ కోసం ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదలను ఎంచుకున్న మంజుమ్మల్ బాయ్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికన్నా ఎక్కువ జోరు చూపిస్తోంది. విజయ్ దేవరకొండ పోటీని తట్టుకోగలదానే అనుమానాలు పటాపంచలు చేస్తూ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల బుకింగ్స్ ని పరిగణనలోకి తీసుకుంటే 38 వేల టికెట్లు అమ్మడు పోవడమంటే మాటలు కాదు. ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అందులోనూ స్టార్స్ లేని ఒక మాములు మూవీకి ఇంత రెస్పాన్స్ అంటే అనూహ్యమే.
ఆదివారం ఈ దూకుడు కొనసాగడం ఖాయం. చాలా చోట్ల షోలు పెంచేశారు. ముందు ఇవ్వమని మంకుపట్టు పట్టిన కొన్ని మల్టీప్లెక్సులు డిమాండ్ గమనించాక క్రమంగా కౌంట్ పెంచడం మొదలుపెట్టాయి. ఏపీలోని ఒక జిల్లా కేంద్రంలోనని థియేటర్ సముదాయంలో ఫస్ట్ డే కేవలం రెండు షోలు ఇచ్చారు. ప్రీమియర్ కావడం ఆలస్యం ఆ సంఖ్య అయిదు దాటేసింది. దీన్ని బట్టే జనానికి ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు . అలా అని ఇదేదో వంద కోట్లు తెచ్చే స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడదు కానీ ఇంత మాత్రం రాబట్టడం మాత్రం చాలా గొప్ప సక్సెస్ కిందే లెక్క.
చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ కి మరోసారి పంట పడినట్టే. ఎల్లుండి ఉగాది పండక్కు ఇదే పికప్ కొనసాగుతుంది. అలా అని తెలుగు ఆడియన్స్ నుంచి యునానిమస్ గా అదిరిపోయే టాక్ రాలేదు కానీ మంచి అనుభూతితో బయటికి వచ్చి దాన్నే టాక్ రూపంలో ఇతరులకు చెబుతున్నారు. అది పాజిటివ్ గా వెళ్ళిపోయి కలెక్షన్లు పెరుగుతున్నాయి. దానికి తోడు కేరళలో 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో అంతగా ఏముందబ్బా అనే యాంగ్జైటీతోనే వెళ్తున్న ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు రెండు కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చిందట. ఇదే ఫ్లో ఉంటే ప్రేమలుని సులభంగా దాటేస్తుంది.
This post was last modified on April 7, 2024 12:50 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…