Movie News

రాజుగారి ప్రేమను అర్థం చేసుకోవచ్చు కానీ

ది ఫ్యామిలీ స్టార్ ఫలితానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు నిర్మాత దిల్ రాజు నమ్మలేకపోతున్న వైనం మాటల్లో, చేతల్లో కనిపించడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నిన్న ఏకంగా రివ్యూయర్ గా మారిపోయి థియేటర్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. గతంలో బ్లాక్ బస్టర్లకు కూడా ఇలా చేసిన దాఖలాలు లేవు. దీన్ని బట్టే హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కన్నా ఎక్కువగా ఆయన ఎంతగా ఈ మిడిల్ క్లాస్ స్టోరీని ప్రేమించారో అర్థం చేసుకోవచ్చు.

స్వంత సినిమా కాబట్టి అంత ఆపేక్ష ఉండటంలో తప్పు లేదు. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవల్ పరిస్థితి వేరుగా ఉండటం కప్పిపుచ్చేది కాదు. బుక్ మై షోలో ఫ్యామిలీ స్టార్ కన్నా టిల్లు స్క్వేర్ టికెట్లే రెండు మూడు వేలు ఎక్కువగా అమ్ముడుపోవడం కళ్ళముందు కనిపిస్తోంది. చాలా చోట్ల మంజుమ్మెల్ బాయ్స్ హౌస్ ఫుల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఆదివారం కీలకం కావడం, మంగళవారం ఉగాది పండగ సెలవు నేపథ్యంలో వీలైనంత వసూళ్లు రావటానికి ఫ్యామిలీ స్టార్ కు ఈ రెండు రోజులు చాలా కీలకం. కానీ దీని కంటే ఎక్కువగా పోటీదారులు వాటిని క్యాష్ చేసుకునేలా ఉండటం ఈ ఆందోళనకు కారణం.

నిర్మాతగా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాని మరింత చేరువ చేయడం కోసం దిల్ రాజు ఇంత చేయడం తప్పు పట్టేది కాదు. ఈ కమిట్ మెంట్ వసూళ్లుగా మారినప్పుడే సార్థకత చేకూరుతుంది. ప్రేక్షకులు కేవలం ఆయన ఒక్కరి మాట విని నిర్ణయాలు తీసుకోరుగా. పబ్లిక్ టాక్ ఎవరూ ఆపేది కాదు, నియంత్రించేది కాదు. కావాలని ఎవరో పుట్టించేది కాదు. కంటెంట్ లో సత్తా ఉంటే ఇదే దిల్ రాజు గారి బలగం నైజాంలో రికార్డులు సృష్టించిన విషయం మర్చిపోకూడదు. ఆడగకపోయినా అప్పుడు అందరూ మద్దతు ఇచ్చారు.. శాయశక్తులా దిల్ రాజు చేస్తున్న పబ్లిసిటీ మంచి రిజల్ట్ గా మారితే సంతోషమే.

This post was last modified on April 7, 2024 12:45 pm

Share

Recent Posts

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 minutes ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

9 minutes ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

17 minutes ago

థియేటర్లలో వావ్… ఇప్పుడు వామ్మో

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…

1 hour ago

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

3 hours ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

4 hours ago