గత నెలలో ‘ప్రేమలు’ అనే మలయాళ అనువాద చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిన్నపాటి సంచలనమే రేపింది. ఇది మామూలు లవ్ స్టోరీనే. అందులో హీరో హీరోయిన్లు అస్సలు మనవాళ్లకు పరిచయం లేదు. అయినా ఆ చిత్రం ఆశ్చర్యకర రీతిలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన ఎస్.ఎస్.కార్తికేయ మంచి లాభాలందుకున్నాడు. తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ స్టేటస్ తెచ్చుకుంది.
ఇప్పుడు అలాంటి మ్యాజిక్కే ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా రిపీట్ చేస్తుందా అని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ చిత్రానికి రిలీజ్ టైమింగ్ అంత బాగా కుదిరింది. ఏప్రిల్ అంటే సినిమాలకు అనువైన సమయం. ఎలాంటి సినిమాకైనా ఈ సీజన్లో మంచి వసూళ్లే వస్తుంటాయి.
పైగా ఈ వారం రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రేక్షకులకు సెకండ్ ఛాయిస్ లాగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఉంది. ఈ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నెల రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ థ్రిల్లర్ మూవీ కోసం తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది ఎదురు చూస్తున్నారు.
‘ప్రేమలు’ తరహాలోనే ముందు రోజు ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే మంచి స్పందన వచ్చింది. డిమాండును బట్టి చివర్లో షోలు కూడా పెంచాల్సి వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వస్తుండడంతో మంచి బజ్ మధ్య రిలీజ్ కాబోతోంది ‘మంజుమ్మెల్ బాయ్స్’. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తుండడంతో మంచి థియేటర్లు దొరుకుతున్నాయి. పబ్లిసిటీకీ ఢోకా ఉండదు. కాబట్టి ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on April 6, 2024 10:14 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…
రాజ్యసభకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒకటి మాత్రం కూటమి పార్టీలకు…
ఒకప్పుడు కామెడీ సినిమాల కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో వెనుకబడినట్టు అనిపించినా…
చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ లేని కొరతను తీరుస్తూ రజనీకాంత్ కు జైలర్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు.…