గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. ఫ్యామిలీ స్టార్. ఈ కాంబినేషన్‌కు తోడు దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం, తెలుగులో ఇప్పటికే రెండు పెద్ద హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయిందీ చిత్రం. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా వరకు లో రేటింగ్సే పడ్డాయి.
ఐతే తమ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వస్తే నిర్మాతలు ఫీలవడం.. సమీక్షకులను విమర్శించడం మామూలే. కానీ దిల్ రాజు మాత్రం రివ్యూయర్ల పట్ల సానుకూలంగానే స్పందించాడు. తాము సినిమాకు వచ్చిన సమీక్షలను అంగీకరిస్తామన్నాడు.
రివ్యూయర్ల పని రివ్యూయర్లు చేశారని.. తాను ప్రతి సినిమాకు జెన్యూన్‌గా ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని.. ఫ్యామిలీ స్టార్ విషయంలోనూ సమీక్షకులు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్స్‌ను అంగీకరిస్తామని రాజు అన్నాడు. ఐతే రివ్యూలు నెగెటివ్‌గా ఉన్నప్పటికీ.. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మాత్రం 90 శాతం సానుకూల స్పందన వస్తోందని.. కుటుంబ ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని దిల్ రాజు చెప్పాడు. తనతో టచ్‌లో ఉండే మీడియా వాళ్లు కూడా ప్రెస్ షోకు ఫ్యామిలీస్‌తో హాజరై తాము సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పారని రాజు తెలిపాడు. థియేటర్లలో చాలా సన్నివేశాలకు అద్భుతమైన స్పందన వస్తోందని రాజు అన్నాడు.
సినిమా ద్వితీయార్ధం అంతా అమెరికాలో కథ నడవడంపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంపై రాజు స్పందిస్తూ.. మొత్తం కథను ఇక్కడే ఫ్యామిలీ మధ్య తీస్తే టీవీ సీరియల్ తీశారని అంటారని.. అందుకే యూత్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా కథను అక్కడికి షిఫ్ట్ చేశామని చెప్పాడు.
This post was last modified on April 6, 2024 10:10 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…