నిన్న విడుదలై ది ఫ్యామిలీ స్టార్ కు వచ్చిన మిశ్రమ స్పందన కలెక్షన్లలో కనిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు తమ సినిమా తొంభై శాతం ప్రేక్షకులకు నచ్చిందని, అందరూ ఫోన్లు మెసేజుల్లో అభినందిస్తున్నారని చెబుతున్నా సోషల్ మీడియా ట్రెండ్స్, పబ్లిక్ టాక్, రివ్యూలు అంచనాలు అందుకోలేదన్న ఏకాభిప్రాయాన్ని మెజారిటీ శాతంలో వ్యక్తం చేశాయి. ఫైనల్ గా హిట్టా కాదా అని చెప్పడానికి తొందరేమీ లేదు కానీ విజయ్ దేవరకొండ రియలైజ్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. కంటెంట్, క్వాలిటీ పరంగా భారీ ఎత్తున ప్రమోషన్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ కు భీకరమైన ఓపెనింగ్స్ రాలేదన్నది వాస్తవం.
కొన్నేళ్ల క్రితం డియర్ కామ్రేడ్ టైంలో ఉన్న హైప్ కి ఇప్పటి రౌడీ హీరో సినిమాలకొస్తున్న బజ్ లో వ్యత్యాసం కనిపిస్తోంది. అది లైగర్ వల్ల జరిగిందా అనేది పక్కన పెడితే సరైన సబ్జెక్టు పడితే రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంటర్వ్యూలలో ఎలివేషన్లు, కెరీర్లో పడ్డ కష్టాలు, మొన్నటి దాకా పీనట్స్ ని పారితోషికంగా తీసుకున్నానని చెప్పిన కబుర్లు ఇవన్నీ మరీ ఎక్కువ పాజిటివిటీ ఇవ్వలేదు. పైగా పెళ్లి చూపులు తర్వాతే బైక్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాని విజయ్ అన్న మాటలు నెగటివ్ గానే బయటికి వెళ్లాయి. దీని గురించి రకరకాల చర్చలు ట్రోల్స్ సహజమే.
సినిమా రిలీజ్ కు ముందు సరైన హైప్ లేకపోతే వందకు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోల బెనిఫిట్ షోలకే జనాలు కరువవుతున్నారు. అలాంటిది ఆషామాషీ కంటెంట్లతో విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోల గుడ్డిగా నడవడానికి లేదు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి సక్సెస్ కు కారణమేంటో విశ్లేషించుకోవాలి. కొత్త డైరెక్టర్లను వద్దనుకోవడం మంచిదే. మరి అనుభవమున్న వాళ్ళతో చేస్తున్నప్పుడు కూడా కేర్ తీసుకోవాలిగా. నాని ప్లానింగ్ ఎలాంటి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయో చూస్తున్నాం. సో విజయ్ దేవరకొండ మాటల కన్నా చేతలే ఎక్కువ పని చేయాల్సిన సమయం వచ్చేసింది.
This post was last modified on April 6, 2024 10:12 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…