కెరీర్ ప్రారంభంలో వరస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శృతి హాసన్ తర్వాత ఒక్కసారిగా బ్లాక్ బస్టర్లతో కొంత కాలం చెలరేగిపోయింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మొదటి బ్రేక్ ఇస్తే ఆపై వరసగా మహేష్ బాబు శ్రీమంతుడు, రవితేజ బలుపు, రామ్ చరణ్ ఎవడు ఇలా మాములు హిట్లు పడలేదు. తర్వాత కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కాటమరాయుడు నుంచి గ్రాఫ్ కిందకు వెళ్తూ ఇబ్బంది పెట్టింది. ఒకదశ దాటాక కొంత గ్యాప్ తీసుకుని తిరిగి రవితేజ క్రాక్, బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ లతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంలో తనకు ఎక్కువ లెన్త్ ఉంటుందట. వీటి సంగతలా ఉంచితే శృతి హాసన్ ప్రస్తుతం ఒక హాలీవుడ్ మూవీ చేస్తోంది. దాని పేరు చెన్నై స్టోరీ. టైటిల్ చూస్తే ఇండియన్ నేటివిటీలా అనిపిస్తున్నా దర్శకుడు ఫిలిప్ జాన్ తో సహా మొత్తం ఇంగ్లీష్ బ్యాచే పని చేస్తోంది. అరేంజ్మెంట్స్ అఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ డిటెక్టివ్ గా కీలక పాత్ర చేస్తోంది. ఇంగ్లీష్, తమిళంలో సమాంతరంగా షూట్ చేస్తున్నారు. అన్ని భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నారు. ఇతర క్యాస్టింగ్ వివరాలు బయటికి చెప్పలేదు కానీ బడ్జెట్ భారీనే.
నిజానికీ ఆఫర్ ముందు సమంత దగ్గరకు వెళ్లిందని టాక్. సరిగ్గా అదే సమయంలో అనారోగ్యం వల్ల ఒప్పుకోలేని పరిస్థితిలో వదులుకుంది. దీంతో ఈ అదృష్టం శృతి హాసన్ ని వరించింది. అడవి శేష్ తో డెకాయిట్ చేస్తున్న ఈ కమల్ తనయకు ఒకరకంగా శుక్రమహర్దశ నడుస్తోందని చెప్పాలి. సౌత్ హీరోయిన్లకు కలగా చెప్పుకునే హాలీవుడ్ అవకాశమంటే మాటలా. సలార్ 2కి శృతి హాసన్ ఇంకా డేట్లు ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ఈ ముగ్గురివి సెట్ అయితే తప్ప తనకు కాల్ రాదు. ఈ ఏడాదే విడుదల కాబోతున్న డెకాయిట్ లో ఛాలెంజింగ్ పాత్ర దక్కిందని టాక్.
This post was last modified on April 6, 2024 7:29 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…