గుంటూరు కారం ఫలితం పూర్తి సంతృప్తినివ్వకపోయినా టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సితార సంస్థ ఆనందం అంతా ఇంతా కాదు. వరసగా సినిమాలు తీయడంలో మైత్రినే దూకుడుగా ఉందనుకుంటున్నాం కానీ ఒకపక్క భారీ బడ్జెట్ ఇంకోవైపు మీడియం రేంజ్ మూవీస్ తో సితార సైతం భారీ ప్రణాళికలు వేస్తోంది. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ మే విడుదలకు రెడీగా ఉంది. గతంలోలా ఈసారి ఎలాంటి వాయిదాలకు ఛాన్స్ లేదు. కంటెంట్ పట్ల టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సగానికి పైగా పూర్తయ్యింది. హీరోతో పాటు వెంకీ అట్లూరి బ్రాండ్ బిజినెస్ పరంగా ఉపయోగపడుతోంది.
బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎన్బికె 109’ మీద మాములు అంచనాలు లేవు. బడ్జెట్ కు తగ్గట్టే బిజినెస్ కూడా హాట్ కేక్ కానుంది. వీలైతే దీపావళి లేదా వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు. కొత్తవాళ్లతో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేసిన ‘మేజిక్’ మీద ప్రమోషన్లు మొదలయ్యాక హైప్ వచ్చేస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం టైటిల్ కు తగ్గట్టు మాయాజాలం చేస్తుందని టాక్. వేసవిలో ‘మ్యాడ్ మ్యాక్స్’ షూట్ ప్రారంభించబోతున్నారు. క్యాస్టింగ్ ని కొనసాగిస్తూనే దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఫన్ డోస్ భారీగా పెంచబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఇచ్చిన కిక్ వల్ల కసిమీదున్నారు.
ఇక ‘టిల్లు క్యూబ్’కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అతి త్వరలో మొదలుకాబోతున్నాయి. రవితేజ హీరోయిన్ రుక్మిణి వసంత్ కాంబోలో అనుదీప్ దర్శకుడిగా ఒక ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అశోక గల్లా హీరోగా రూపొందే అతని మూడో సినిమా అనౌన్స్ మెంట్ సితార టీమ్ ఇవాళే ఇచ్చారు. సాయి దుర్గ తేజ్ తో నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ తాలూకు అయోమయం ఒక్కటే తీరాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరిల విడి 12 రౌడీ హీరో కెరీర్లోనే అత్యంత కాస్ట్లీ మూవీగా ప్లాన్ చేశారు. ఇదంతా చూస్తుంటే సితార స్పీడ్ మామూలుది అనగలరా.
This post was last modified on April 5, 2024 6:14 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…