మంచి అంచనాల మధ్య ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. పబ్లిక్ టాక్, రివ్యూల సంగతులు మరికొన్ని గంటలు, నిమిషాల్లో డిసైడైపోతాయి కానీ కానీ దీని సక్సెస్ విజయ్ దేవరకొండకే కాదు టీమ్ లో కీలక సభ్యులందరికీ చాలా అవసరం. లైగర్ చేసిన తీవ్ర గాయం విజయ్ మార్కెట్ ని ప్రభావితం చేసింది. ఖుషి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ మిక్స్డ్ టాక్ తో ఆశించిన రేంజ్ కి వెళ్ళకపోవడం అభిమానులను నిరాశపరిచేదే. అందుకే గీత గోవిందం తరహాలో కుటుంబ ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరవుతాననే నమ్మకంతో అదే దర్శకుడితో కోరిమరీ చేతులు కలిపాడు.
ఇక లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ కు ఆ ట్యాగ్ నిలబడాలంటే ఇది సక్సెస్ అవ్వాలి. ఇప్పటిదాకా ఫ్లాప్ లేని ట్రాక్ రికార్డు తనది. దిల్ రాజు విషయానికి వస్తే కంటెంట్ మీద నమ్మకంతో అంతా తానై ప్రమోషన్లలో విపరీతంగా పాల్గొన్నారు. పనుల ఒత్తిడిలోనూ ప్రెస్ మీట్లు, ప్రీమియర్లు, ఈవెంట్లు, ఇన్ఫ్లూయన్సర్లతో సమావేశాలు ఒకటా రెండా స్టేజిల మీద డాన్సులు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇదంతా పబ్లిసిటీ కోసం కాదు. బొమ్మరిల్లు రేంజ్ లో ఇది ఆడుతుందనే నమ్మకం ఆయనది. దానికి తగ్గట్టే బడ్జెట్ కూడా చాలా భారీగా ఖర్చు పెట్టారు.
అవకాశాలు వస్తున్నా వాటిని పెద్ద స్థాయిలో నిలబెట్టుకోలేకపోతున్న సంగీత దర్శకుడు గోపి సుందర్ సైతం దీంతోనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. గీత గోవిందంలో ఇంకేం కావాలె లాంటి మేజిక్ ట్రాక్ ఇవ్వలేదని ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నా నంద నందనా, కళ్యాణి వచ్చా లాంటి పాటలు జనాల్లోకి బాగానే వెళ్లాయి. దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాటని హ్యాండిల్ చేసిన విధానం మీద విమర్శలు మర్చిపోయేవి కాదు. దానికి సమాధానం ఫ్యామిలీ స్టార్ రూపంలోనే దొరకాలి. సో వీళ్ళందరికీ ఫ్యామిలీ స్టార్ విజయం కీలకం. ఆ బరువంతా ప్రధానంగా మోస్తున్న విజయ్ దేవరకొండనే.
This post was last modified on April 5, 2024 8:30 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…