లేటెస్ట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ రిలీజైన మొదటి రోజు మధ్యాన్నమే నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫైనల్ రన్ కి ఈజీగా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే నిజమవుతోంది. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన ప్రకారం ఇంకా మొదటి వారం పూర్తవ్వకుండానే 91 కోట్ల గ్రాస్ తో సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. నిజానికి దీని మీదున్న అంచనాలకు ఇది పెద్ద మొత్తమే. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి మిశ్రమ స్పందన మోసుకుంటూ వచ్చిన ఈ ఎంటర్ టైనర్ ఫైనల్ గా బ్లాక్ బస్టర్ ముద్ర వేయించుకుంది.
రేపు ఫ్యామిలీ స్టార్ రిలీజవుతున్నా దాని ప్రభావం టిల్లు స్క్వేర్ మీద తీవ్రంగా లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయం. బుక్ మై షోలో సగటు గంటల చొప్పున లెక్కేసే అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి దాదాపు సమానంగా ఉండటం షాకే. ఎందుకంటే విజయ్ దేవరకొండ లాంటి ఇమేజ్ ఉన్న హీరో కొత్త సినిమాతో సమానంగా ఎనిమిదో రోజు వసూళ్లను హోల్డ్ చేయడం చిన్న విషయం కాదు. వీక్ డేస్ లోనూ ఈ దూకుడు ఎవరూ ఊహించనిది. ఫ్యామిలీ స్టార్ వల్ల థియేటర్ కౌంట్ లో తగ్గుదల ఉండొచ్చేమో కానీ కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందుతున్న వార్త.
ఇంకో రెండు వారాలకు పైగా టిల్లు ప్రభంజనం కొనసాగేలా ఉంది. వచ్చే వారం నుంచి మరీ చెప్పుకోదగ్గ భారీ చిత్రాలు లేకపోవడం సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ ఇద్దరికీ ప్లస్ కానుంది. రంజాన్ సందర్భంగా బాలీవుడ్ లో బడా సినిమాలున్నాయి కానీ తెలుగులో ఉగాది తర్వాత చెప్పుకోదగ్గవి లేవు. సో ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఏప్రిల్ చివరి వరకు థియేటర్ల ఫీడింగ్ కి ఇవి సరిపోతాయి. యూత్ ఒకదానికి, ఫ్యామిలీస్ మరొకదానికి వెళ్లిపోతాయి. వేసవిలో హిట్ల ఖాతాలో టిల్లు స్క్వేర్ మంచి బోణీ చేసింది. చేతిలో కథ రెడీ కాకపోయినా అప్పుడే టిల్లు క్యూబ్ మీద హైప్ మొదలైంది.
This post was last modified on April 4, 2024 3:59 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…