రేపు విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మీద విజయ్ దేవరకొండ అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతికి హనుమాన్ చేసిన రచ్చ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో దూకుడు చూపించింది టిల్లు స్క్వేర్ ఒక్కటే. మధ్యలో ఊరి పేరు భైరవకోన, ఓం భీం బుష్ లాంటివి కమర్షియల్ గా వర్కౌట్ చేసుకున్నాయి కానీ వారాల తరబడి జనాలతో థియేటర్లు కళకళలాడేలా చేయలేకపోయాయి. దానికి తోడు ఎన్నికల వాతావరణం, రాజకీయ పరిణామాలు, ఐపీఎల్ క్రికెట్ సందడి వగైరాలు మూలిగే నక్క మీద తాటిపండులా కలెక్షన్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ మీద ఆశలు పెట్టుకోవడం సహజం. ట్రేడ్ టాక్ ప్రకారం సుమారు 45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో రౌడీ హీరో బరిలో దిగుతున్నాడు. ఇది ఖుషి కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బయ్యర్లు కూడా హిట్ టాక్ వస్తే సులభంగానే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. టిల్లు స్క్వేర్ జోరు ఇంకా తగ్గనప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు అదింకా ఆప్షన్ గా మారలేదు. పిల్లలకు వేసవి సెలవులు మొదలు కానుండటంతో ఫ్యామిలీ స్టార్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ టాక్ చాలా కీలకం కానుంది. చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోయినా అండర్ కవర్ ఏజెంట్ లా వస్తున్న మంజుమ్మల్ బాయ్స్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రేమలు లాగా సర్ప్రైజ్ చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. కాకపోతే మలయాళం డబ్బింగుల ఫలితాలు ముందే ఖచ్చితంగా ఊహించలేని పరిస్థితి నెలకొంది. గీత గోవిందం కాంబినేషన్, మృణాల్ ఠాకూర్ లక్కీ హ్యాండ్, గోపి సుందర్ సంగీతం ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ కు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అగ్రెసివ్ హీరోయిజం లేకుండా సగటు మధ్యతరగతి కుర్రాడిగా విజయ్ దేవరకొండ మేకోవర్ ఆకర్షణగా నిలుస్తోంది.
This post was last modified on April 4, 2024 3:18 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…