బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన చాలామంది కుర్రాళ్లు.. తర్వాత హీరోలై అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. కానీ తరుణ్ తప్ప సుదీర్ఘ కెరీర్ కలిగిన వాళ్లు తక్కువమందే. తరుణ్ సైతం ఒక దశ దాటాక సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయిపోయాడు.
ఆ తర్వాత మళ్లీ హీరోగా బలమైన ముద్ర వేసిన బాల నటుడు తేజ సజ్జనే. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు.. ఇలా ఒకప్పటి టాప్ స్టార్లు చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ.. ముందుగా ‘ఓ బేబీ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత ‘జాంబి రెడ్డి’తో హీరోగా మారి ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు. ఇక అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం ‘హనుమాన్’ మూవీనే. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్‌నే మార్చేసింది.
తేజ తర్వాతి సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతను ‘హనుమాన్’ రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పేరు.. మిరాయ్. ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న చిత్రమిది. ‘మిరాయ్’ అనేది జపనీస్ వర్డ్. ఇదొక యాక్షన్ మూవీ అంటున్నారు. ఇందులో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ‘ఈగల్’ను నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ముందు ఓ మోస్తరు బడ్జెట్లో తీయాలనుకున్న మూవీ ఇది.
కానీ ‘హనుమాన్’తో తేజ మార్కెట్ పెరిగిపోవడం, పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ ఉండడంతో మంచి క్వాలిటీతో పెద్ద స్థాయిలోనే సినిమా తీయాలని ప్రణాళికలు మార్చారట. దీంతో బడ్జెట్ రూ.40 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇందులో తేజ సరసన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితిక నాయక్ నటిస్తోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. వేసవి చివర్లో సినిమా రిలీజవుతుందట.
This post was last modified on April 3, 2024 10:19 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…