‘సీతారామం’ సినిమాతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది మరాఠీ అమ్మాయి, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో ఇంతగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన కథానాయికలు అరుదుగా కనిపిస్తారు. ఆ చిత్రంలో అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకుంది మృణాల్. ఇలాంటి కాంబినేషన్లో హీరోయిన్ల కోసం దర్శకులు కూడా ఎదురు చూస్తుంటారు.
తెలుగులో మంచి మంచి అవకాశాలు వచ్చినా.. మృణాల్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రెండో సినిమాగా ‘హాయ్ నాన్న’ లాంటి మరో మంచి మూవీని ఎంచుకుంది. ఆ సినిమా కూడా హిట్టయింది. మరోసారి మృణాల్ అందం, అభినయం అందులో హైలైట్ అయ్యాయి. వరుసగా రెండో చిత్రం కూడా పెద్ద హిట్ కావడంతో మృణాల్‌కు లక్కీ ఛార్మ్‌గా పేరొచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి రానున్న కొత్త చిత్రం.. ఫ్యామిలీ స్టార్.
‘గీత గోవిందం’ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్లో రానున్న సినిమా అంటే ఆటోమేటిగ్గా మంచి అంచనాలుంటాయి. ఇక మృణాల్ కూడా తోడవడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే భరోసా ప్రేక్షకుల్లో ఏర్పడింది. మృణాల్ నుంచి ప్రేక్షకులు ఆశించే పాత్ర లాగే కనిపిస్తోంది తన క్యారెక్టర్. ఇందులోనూ ఆమె అందంగా కనిపిస్తోంది. అలాగే పాత్రలో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్నట్లే కనిపిస్తోంది.
విజయ్, పరశురామ్‌లకు ‘గీత గోవిందం’ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో మృణాల్ లక్ ఫ్యాక్టర్ పని చేసి ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నారు. విజయ్‌తో పని చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్న దిల్ రాజు ఈ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు. శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి మంచి టైమింగ్ కూడా కుదిరింది. అన్నీ కలిసొచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్టవుతుందేమో చూడాలి.
This post was last modified on April 3, 2024 10:18 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…