ఈ మధ్య తెలుగులో మలయాళ అనువాదాల హడావుడి పెరిగింది. గత నెలలో భ్రమయుగం, ప్రేమలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో భ్రమయుగం ఓ మోస్తరుగా ఆడగా.. ప్రేమలు అందరి అంచనాలనూ మించిపోయి సూపర్ హిట్‌గా నిలిచింది. మార్చి రెండో వారంలో దీంతో పాటుగా గామి, భీమా లాంటి క్రేజీ తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి.
ఐతే వాటికి దీటుగా ప్రేమలు తెలుగు వెర్షన్ వసూళ్లు రాబట్టింది. భీమా మూవీకి ప్రేమలు చాలా డ్యామేజ్ చేసిన మాట కూడా వాస్తవం. గామి వసూళ్ల మీద కూడా దీని ప్రభావం కొంత పడింది. దీంతో మలయాళ సినిమాలను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే మలయాళం నుంచి రానున్న కొత్త చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ మీద టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు దృష్టిసారించాయి.
ఫ్యామిలీ స్టార్ లాంటి క్రేజీ మూవీకి పోటీగా మంజుమ్మెల్ బాయ్స్ ఈ నెల 5న విడుదల కాబోతోంది. మంజుమ్మెల్ బాయ్స్ మలయాళంలో మామూలు సంచలనం రేపలేదు. రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళనాట అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగానూ నిలిచింది. మన ప్రేక్షకులు అసలే కంటెంట్ బాగుంటే చాలు. ఏ భాషా చిత్రాన్నయినా ఆదరిస్తారు.
ఈ నేపథ్యంలో మంజుమ్మెల్ బాయ్స్.. ఫ్యామిలీ స్టార్‌కు ఎలాంటి డ్యామేజ్ చేస్తుందన్నది ఆసక్తికరం. కాకపోతే ఇది సీరియస్ మూవీ. జనాలు ఇప్పుడు ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ ఇరగాడేస్తోంది. ఫ్యామిలీ స్టార్ కూడా మంచి ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. కాబట్టి వాటిని దాటి మంజుమ్మెల్ బాయ్స్ వైపు తెలుగు ప్రేక్షకులు చూస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే.
This post was last modified on April 3, 2024 4:10 pm
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…