ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదల తేదీలో మార్పు గురించి వైజయంతి నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ప్రస్తుతానికి మే 9 ప్రకారమే బ్యాలన్స్ షూటింగ్ తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వచ్చే నెలకంతా ఇవి కొలిక్కి రావడం కష్టమేనని ఇన్ సైడ్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రిస్క్ అవుతుందని, పోలింగ్ ఇంకో నాలుగు రోజుల్లో పెట్టుకుని జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లో ఉండరని బయ్యర్లు చెబుతుండటంతో టీమ్ ఆలోచనలో పడింది. క్రమం తప్పకుండ చర్చలు జరుగుతున్నాయి కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు కల్కి బృందం మే 30 రిలీజ్ ని పరిశీలనలో ఉంచినట్టు తెలిసింది. ఎలాగూ వేసవి సెలవులు జూన్ మూడో వారం దాకా ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్, కలెక్షన్ల గురించి టెన్షన్ అక్కర్లేదని ఎగ్జిబిటర్లు వివరించి చెప్పినట్టు సమాచారం. గతంలో బాహుబలి 2, కెజిఎఫ్ లాంటివి సమ్మర్ లోనే వచ్చి వసూళ్లు కొల్లగొట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మే 30 లోగా కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. టిడిపి జనసేన పాలన వచ్చినా లేక వైఎస్ఆర్ పార్టీ కొనసాగినా అప్పటికంతా పొలిటికల్ హీట్ చల్లబడిపోయి ఉంటుంది కాబట్టి కల్కికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇదంతా తేలడానికి కొంత టైం పట్టొచ్చు. ఏదైనా సరే కల్కి ఖచ్చితంగా వేసవిలోనే రావాలి. వేరే ఆప్షన్ ఆలోచిస్తే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా ఓటిటి డీల్ అవ్వలేదు. టీజర్ వచ్చాక చేసుకుందామని పెండింగ్ లో ఉంచారు. పైగా నిర్మాత చెప్పిన భారీ రేటుకి సానుకూల స్పందన రాలేదట. టీజర్ వచ్చాక కంటెంట్ గురించి అవగాహన వస్తుంది కాబట్టి హెచ్చుతగ్గులు అప్పుడు చూసుకోవచ్చు. మే నెల ఎంతో దూరంలో లేదు. పాతిక రోజులు గడిస్తే వచ్చేస్తుంది. కల్కి టీమ్ నుంచి వీలైనంత త్వరగా ఏదో ఒకటి స్పష్టంగా తేల్చే కబురు వస్తే తప్ప ప్రభాస్ ఫాన్స్ రిలాక్స్ అవ్వలేరు
This post was last modified on April 3, 2024 3:52 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…