వరుస ఫ్లాపులు రావడంతో పాటు తన సినిమాలకు కనీసం వసూళ్లు కూడా రావడం లేదని గ్రహించిన పిమ్మట నారా రోహిత్ రెండేళ్ల పాటు అసలు సినిమాలే చేయలేదు. ఈ సమయంలో బరువు తగ్గించి స్లిమ్ అయిన రోహిత్ ఇప్పుడు కొత్త లుక్‍తో దర్శనమిస్తున్నాడు. ఫుల్లుగా గడ్డం పెంచి తన న్యూ లుక్‍ని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‍గా పెట్టాడు. దీంతో రోహిత్ మళ్లీ నటించడానికి రెడీ అయిపోయాడని అతనంటే ఇష్టపడే వాళ్లు ఆనందంగా స్పందిస్తున్నారు.
రోహిత్ లుక్ కంటే ముందుగా అల్లు అర్జున్ – సుకుమార్‍ల ‘పుష్ప’ సినిమాలో విలన్‍గా నటించబోతున్నాడనే న్యూస్ హల్‍చల్ చేసింది. కానీ దాని గురించి రోహిత్ ఇంతవరకు స్పందించలేదు. కానీ రోహిత్ కొత్త లుక్ చూసిన తర్వాత ‘పుష్ప’లో క్యారెక్టర్ ఇతను చేస్తే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారు. ఇంకా హీరోగానే కొనసాగాలనే ఆలోచనతోనే రోహిత్ ఇంత బ్రేక్ తీసుకున్నాడు.
తీరా ఇంత గ్యాప్ తర్వాత విలన్ వేషమేస్తే ఇక తనను అలాంటి పాత్రలకు ఫిక్స్ చేసేస్తారేమో అనే ఆందోళన వుండొచ్చు. గోపిచంద్ హీరోగా నటించిన తర్వాత విలన్ వేషాలేసి పెద్ద మాస్ హీరోగా మారిపోయిన సంగతి రోహిత్ మరచిపోకూడదు.
This post was last modified on September 14, 2020 8:53 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…