హారర్ సినిమాల్లో కామెడీ వచ్చాక క్రియేటివిటీకి బోలెడు అవకాశం దొరికింది. పరిచయం చేసింది లారెన్సే అయినా మిగిలినవాళ్లు అందిపుచ్చుకుని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్చిలో వచ్చిన ఓం భీం బుష్ సక్సెస్ ప్రేక్షకుల్లో ఈ జానర్ పట్ల ఇంకా ఆసక్తి బ్రతికే ఉందని నిరూపించింది. ఏప్రిల్ 11 మరో దెయ్యం సీక్వెల్ రాబోతోంది. అదే గీతాంజలి మళ్ళీ వచ్చింది. మణిరత్నం ఇళయరాజాల క్లాసిక్ టైటిల్ ని ఆత్మల డ్రామా కోసం వాడేసుకున్న కోన వెంకట్ టీమ్ మరోసారి ప్రయోగానికి సిద్ధ పడింది. అంజలి ప్రధాన పాత్రలో శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ట్రైలర్ ఇవాళ వచ్చింది.
చాలా హారర్ సినిమాల్లోలాగే ఇందులోనూ పాడుబడిన ఒక బంగాళా, దాంట్లో షూటింగ్ కోసం వెళ్లిన ఒక యూనిట్ సభ్యులు ఇలా మొదలుపెట్టారు. అందులో ఉన్న నిజమైన దెయ్యాలను చూసి మెథడ్ యాక్టర్సని పొరపడిన టీమ్ వాటితో స్నేహం చేస్తాయి. హీరోయిన్ తో సహా వచ్చిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. తీరా చూస్తే ముందుకు వెళ్లే కొద్దీ ఎదురైన విచిత్రమైన సంఘటనలు నిజంగానే బయటపెడతాయి. దీంతో వెనక్కు వెళ్లలేక, వాటిని ఎదిరించలేక ఆ గ్యాంగ్ పడే తిప్పలు మాములుగా ఉండవు. తర్వాత ఏం జరిగిందనేది అసలు స్టోరీ.
కామెడీ క్యాస్టింగ్ భారీగా పెట్టుకున్నారు. శ్రీనివాసరెడ్డి, సునీల్, షకలక శంకర్, సత్యం రాజేష్, సత్య, అలీలతో పాటు ఈసారి రవిశంకర్ తోడయ్యారు. ఆ మధ్య ఊరిపేరు భైరవకోనలో చేసిన తరహాలోనే ఈ పాత్ర కూడా కనిపిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా చోటా కె ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పని చేశారు. కాన్సెప్ట్ పరంగా కొత్తదనం ఫీలింగ్ కలిగించలేదు కానీ ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు సరిపడా వినోదాన్ని ఇచ్చినట్టు విజువల్స్ చెబుతున్నాయి. కంటెంట్ కనక వైవిధ్యంగా ఉండి ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ అయితే గీతాంజలి మళ్ళీ హిట్టు కొట్టొచ్చు.
This post was last modified on April 3, 2024 1:58 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…