మాములుగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ అంటేనే పెద్ద రిస్క్. అంచనాలు మోయలేక ఫెయిలయ్యేవి అధికంగా ఉంటే మొదటి భాగాలను మించి బ్లాక్ బస్టర్స్ అయ్యేవి లేకపోలేదు. టిల్లు స్క్వేర్, బాహుబలి 2, కెజిఎఫ్ 2 లాంటివి రెండో క్యాటగిరీలోకి వస్తే ఫస్ట్ దాంట్లో మన్మథుడు 2, కిక్ 2, గాయం 2 ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు తయారవుతుంది. అందుకే కొనసాగింపు అంటే హీరోలు దర్శకులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. పుష్ప, కార్తీకేయ అంత పెద్ద సక్సెస్ అందుకున్నాయి కాబట్టే కంటిన్యుయేషన్ సులభమయ్యింది. ఒక హీరో ఒక సీక్వెల్ చేయడం ఇప్పటిదాకా చూస్తున్నాం.
అలాంటిది ఒకేసారి 8 సీక్వెల్స్ కి రంగం సిద్ధం చేసుకుంటున్న స్టార్ ఉన్నారంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. ఆయనే అజయ్ దేవగన్, ఇటీవలే ‘రైడ్ 2’ మొదలైపోయింది. రవితేజ మిస్టర్ బచ్చన్ అఫీషియల్ గా రీమేక్ చేసుకుంటున్నది దీని మొదటి భాగాన్నే. రకుల్, టబుతో ‘దే దే ప్యార్ దే 2’ పనులు ఇటీవలే షురూ చేశారు. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ అఫ్ సర్దార్’ని వర్తమానంలో కొనసాగించబోతున్నారు. ఆగస్ట్ విడుదలకు ‘సింగం అగైన్’ రెడీ అవుతోంది. ‘దృశ్యం 3’ స్క్రిప్ట్ పనులు జీతూ జోసెఫ్ కొలిక్కి తెస్తున్నారు. ఢమాల్ 4, గోల్ మాల్ 5 ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్తాయి.
ఇవి కాకుండా ‘షైతాన్ 2’ని అజయ్ దేవగన్, జ్యోతికలతో పాటు మాధవన్ ని కొత్త షేడ్ లో చూపించే దిశగా ప్రతిపాదన సిద్ధమయ్యిందట. ఈ లెక్కన ఏ భాషలో చూసినా ఇన్ని సీక్వెల్స్ కి సానుకూలంగా ఉన్న ఏకైన హీరో అజయనే చెప్పాలి. వేగంగా తీయడంలో నటించడంలో పేరున్న అజయ్ దేవగన్ దర్శకుడిగానూ యుమీ ఔర్ హం, శివాయ్, భోలా, రన్ వే 34తో ఈ విభాగంలోనూ తనదైన ముద్ర వేశాడు. అయిదేళ్లకు పైగా నిర్మాణంలో మైదాన్ ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రంజాన్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ప్రియమణి జోడిగా నటించింది.
This post was last modified on April 3, 2024 1:39 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…