విజయ్ దేవరకొండకు మొదట్నుంచి యూత్‌లోనే మంచి ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకు ఆదరణ కొంచెం తక్కువే. ‘పెళ్లిచూపులు’, ‘గీత గోవిందం’ లాంటి చిత్రాలకు కుటుంబ ప్రేక్షకుల మద్దతు కూడా లభించింది కానీ.. మిగతా సినిమాలన్నింటినీ యూతే భుజాల మీద మోశారు. తన సినిమాల్లో ఘాటు సన్నివేశాలుంటాయనే భయం.. దీనికి తోడు బయట విజయ్ అగ్రెసివ్ బిహేవియర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కొంత దూరం చేయడానికి కారణమయ్యాయి.
తనకు ‘బోల్డ్’ ఇమేజ్‌ను కొంచెం తగ్గించుకుంటే తప్ప తన పరిధి విస్తరించదని విజయ్‌కు తెలియంది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు లేకుండా పెద్ద రేంజికి వెళ్లడం అంటే చాలా కష్టం. అందుకే విజయ్ ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ లాంటి ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీ చేశాడు. కానీ అది అంత మంచి ఫలితాన్నివ్వలేదు.
ఇప్పుడు విజయ్ నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ రాబోతోంది. పేరులోనే ‘ఫ్యామిలీ’ ఉండడం.. ఈ సినిమా ప్రోమోలన్నింటిలోనూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హైలైట్ కావడం గమనించవచ్చు. దిల్ రాజు సినిమాలంటేనే ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తాయి. కాకపోతే విజయ్‌కి ఇంతకుముందున్న ఇమేజ్, గత సినిమాల ఫలితాల దృష్ట్యా ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల మద్దతు ఎంతమేర ఉంటుందనే సందేహాలున్నాయి. చిత్ర బృందం మాత్రం పదే పదే ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కు నచ్చే సినిమా అని నొక్కి వక్కాణిస్తోంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘టిల్లు స్క్వేర్’ హవా నడుస్తోంది. దాన్నుంచి ప్రేక్షకుల దృష్టి మళ్లించి ‘ఫ్యామిలీ స్టార్’ వైపు తిప్పడం కీలకం. అందుకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా బాగా మెప్పించాలి. మరి విజయ్-పరశురామ్ జోడీ ఈ విషయంలో ఎంతమేర సక్సెస్ అవుతుందో?
This post was last modified on April 2, 2024 6:23 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…