డీజే టిల్లు అనే సినిమా మొదలైనపుడు.. అది విడుదలకు సిద్ధమవుతున్నపుడు.. దాని గురించి పెద్దగా డిస్కషనే లేదు. కానీ రిలీజ్ తర్వాత అదెంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నిజానికి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ.. థియేటర్ల నుంచి నిష్క్రమించాకే ఆ క్యారెక్టర్ మరింతగా పాపులర్ అయింది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కడ చూసినా టిల్లు వీడియోలే తిరిగాయి.
టిపికల్ డైలాగ్ డెలివరీతో సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన డైలాగులు జనాలకు పిచ్చెక్కించేశాయి. కాల క్రమంలో ఆ క్యారెక్టర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాత్ర మీద జనాలకు ఎంత ప్రేమ ఉందన్నది ఇప్పుడు ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ నంబర్లలో ప్రతిఫలిస్తోంది. స్టార్ హీరోల సినిమాల రేంజిలో తొలి వీకెండ్లోనే రూ.68 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం రేపిందీ చిత్రం.
నిజానికి కథాకథనాల పరంగా చూస్తే ‘డీజే టిల్లు’ లాగే ‘టిల్లు స్క్వేర్’ సైతం యావరేజ్ మూవీనే. ఈ రెండు చిత్రాల్లోనూ లూప్ హోల్స్ చాలా కనిపిస్తాయి. పెద్దగా లాజిక్కులే లేకుండా కథనం నడిచిపోతుంటుంది. కానీ జనాలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. టిల్లు క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతున్నారు. అతను చెప్పే ముచ్చట్లు ఆసక్తిగా వింటున్నారు. అతను అవస్థలు పడుతుంటే.. ఫ్రస్టేట్ అవుతుంటే.. నవ్వుకుంటున్నారు.
కేవలం టిల్లు పాత్ర.. దాని డైలాగుల మీదే సినిమా నడిచిపోతోంది. రెండు గంటల సేపు బాధలన్నీ మరిచిపోయి నవ్వుకునేలా చేస్తోంది ఈ పాత్ర. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్లూ ఎంజాయ్ చేసే క్యారెక్టర్‌గా మారింది ‘టిల్లు’. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచిపోయే అరుదైన సినిమాల్లో ఇదొకటి. హీరో పాత్ర, అలాగే దాన్ని పోషించిన నటుడు లవబుల్‌గా అనిపించడం కూడా సినిమాకు ప్లస్. కష్టపడి హీరోగా నిలదొక్కుకున్న సిద్ధు పట్ల ప్రేక్షకుల్లో సానుకూల భావన ఉండడం కూడా ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిందన్నది వాస్తవం.
This post was last modified on April 2, 2024 3:36 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…