తన పేరిట బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాల కిందట్నుంచి లక్షలాది మందికి అత్యవసర సమయంలో రక్తం అందేలా చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులే కాదు.. సామాన్యులు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవల్ని గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుంటారు.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ బ్లడ్ బ్యాంక్ తన పని తాను చేసుకుపోతుంటుంది. ఐతే కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక జనం బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎంతోమంది సమయానికి రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, తలసేమియా పేషెంట్లకు రక్త కొరత వేధిస్తోంది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మెగాస్టార్.. కష్ట కాలంలో స్వయంగా బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు.
సీనియర్ హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, యువ కథానాయకుడు విశ్వక్సేన్ తదితరులు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే టాలీవుడ్ ఫిలిం జర్నలిస్టులు కూడా రక్తదానానికి ముందుకొచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తం ఇచ్చారు. వీరిని చిరు ఓ ఆడియో సందేశంతో అభినందించారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు ఎల్.లక్ష్మీనారాయణ, వైస్ ఎల్.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు మీరందరూ ఎంతో పెద్ద మనసుతో మా బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి రక్తదానం చేయడం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
మీలాంటి జర్నలిస్టులు ఈ రకంగా ముందుకు రావడం మాకు ఎనలేని ఉత్సాహం, ప్రోత్సాహం అందిస్తాయి. థ్యాంక్ యు సో మచ్. మీ కుటుంబాలన్నింటికీ మంచి జరగాలి అని చిరంజీవి పేర్కొన్నారు.
This post was last modified on April 27, 2020 1:32 am
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…