Movie News

సిద్దూ వైష్ణవి బిజీ : ‘జాక్’కు బ్రేక్ ?

టిల్లు స్క్వేర్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ వాస్తవానికి ఈ వారం నుంచి జాక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ క్రైమ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే టిల్లు జోరు భారీగా ఉండటంతో ప్రమోషన్లను స్టడీగా ఇంకొక్క పది రోజులు కొనసాగిస్తే వంద కోట్ల గ్రాస్ దాటేందుకు అవకాశాలు పెరుగుతాయి కనక ఆ మేరకు సిద్దు డేట్లు దానికే కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని వల్ల జాక్ కు సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని అంతర్గత సమాచారం.

మరోవైపు ఇందులో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఫ్యామిలీ స్టార్ రిలీజయ్యాక లవ్ మీ ఇఫ్ యు డేర్ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. అసలే దిల్ రాజు దీని మీద టన్నుల కొద్ది కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. తన బ్యానర్ కాబట్టి ముందు విజయ్ దేవరకొండ సినిమా సందడి తగ్గాక లవ్ మీ పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట. దానికి అనుగుణంగా ముందుగానే వైష్ణవి డేట్లను బ్లాక్ చేసుకోమని టీమ్ కు పురమాయించినట్టు తెలిసింది. అడిగితే కాదనలేని పరిస్థితి ఆ అమ్మాయిది. దీంతో సరేననడంతో జాక్ కు రెండో ఇబ్బంది మొదలయ్యిందని వినికిడి.

సో ప్లాన్ చేసుకున్న ప్రకారం కాకుండా తప్పని సిచువేషన్ లో జాక్ ని బ్రేక్ వేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇదంతా ఆఫ్ ది రికార్డు జరుగుతున్న మ్యాటరే కాబట్టి అధికారికంగా ఎవరూ ధృవీకరణ చేయరు. ఒకవేళ టిల్లు స్క్వేర్ కనక ఇంత పెద్ద ఫలితం అందుకోకపోయి ఉంటే సిద్దు త్వరగా జాక్ సెట్లో అడుగు పెట్టేవాడేమో. ఆశిష్ హీరో కావడంతో లవ్ మీని దిల్ రాజు ఎంతగా ఎలివేట్ చేస్తున్నారో చూస్తున్నాం. సో కీలక పాత్ర పోషిస్తున్న వైష్ణవి అది రిలీజయ్యే ఏప్రిల్ మూడో వారం దాకా టీమ్ తో ఉండక తప్పదు. టిల్లు హీరో, బేబీ హీరోయిన్ కాంబో కాబట్టి ఈ మాత్రం డిమాండ్ ఉండటం సబబే మరి.

This post was last modified on April 2, 2024 3:19 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago