టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడైన విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. అయితే అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బేనర్లో విజయ్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చలు నడుస్తున్నాయి.
ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్‌తో వీరి కలయిక కార్యరూపం దాల్చింది. తాను కూడా రాజుతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. ఐతే అది ఆలస్యం అయిందని.. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెబుతూ.. కరోనా టైంలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే రాజే అడ్వాన్స్ రూపంలో సాయం చేసిన విషయాన్ని వెల్లడించాడు విజయ్.
ఇక రాజు బేనర్లో గతంలో తనకు అవకాశం దక్కకపోవడం గురించి విజయ్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. రాజు నిర్మించిన కేరింత మూవీ ఆడిషన్స్‌కు తాను హాజరయ్యానని.. కానీ తనకు అవకాశం దక్కలేదని.. అప్పుడు తాను చాలా హర్టయ్యానని.. వీళ్లందరికీ తనేంటో చూపించాలి అని కసిగా అనుకున్నానని.. ఈ విషయం కొన్నేళ్ల కిందటే రాజుతో కూడా చెప్పానని.. కట్ చేస్తే ఇప్పుడు రాజు నిర్మాతగా తాను సినిమా చేశానని విజయ్ తెలిపాడు.
గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆలస్యం కావడం గురించి విజయ్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ కోసమే అది లేటైందని.. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, దర్శకుడు గౌతమ్ అర్థం చేసుకోవడం వల్లే ఫ్యామిలీ స్టార్ చేయగలిగానని.. ఈ విషయంలో వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలని.. త్వరలోనే ఆ సినిమా ఉంటుందని విజయ్ చెప్పాడు.
This post was last modified on April 1, 2024 10:41 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…