టాలీవుడ్ లో ఒకేసారి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ తెరంగేట్రం ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా నట ప్రయాణం మొదలుపెట్టి ఏళ్ళు గడిచినా తెలుగులో అడుగు పెట్టేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంది. దానికి తగ్గట్టే క్రేజీ ప్రాజెక్టులు వచ్చేలా చేయడంలో తండ్రి కం నిర్మాత బోనీ కపూర్ ఇస్తున్న గైడెన్స్ బాగా ఉపయోగపడుతోంది. గత కొంతకాలంగా జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి ముంబై మీడియాలో బోలెడు కథనాలు వస్తున్నాయి.
ఇద్దరు ఘాడమైన ప్రేమలో ఉన్నారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని పలు పత్రికలు ఉటంకించాయి. తాజాగా బోనీ కపూర్ దీని గురించి స్పందించాడు. శిఖర్ మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని, తమ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుంటాడని, కొంత కాలం జాన్వీతో మాటలు లేనప్పుడు కూడా శిఖర్ తో టచ్ లో ఉన్నానని అంత మంచి కుర్రాడని కితాబు ఇచ్చేశారు. అయితే ఇంతకు మించి రిలేషన్ గురించి మాట్లాడలేదు. లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన శిఖర్ పహారియాకు స్వంతంగా ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కంపెనీ ఉంది. సోదరుడితో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నాడు.
ఈ లెక్కన అనధికారికంగానే బోనీ కపూర్ వీళ్ళ బంధానికి ముద్ర వేసినట్టు అయ్యింది. ఏప్రిల్ 10న అజయ్ దేవగన్ మైదాన్ విడుదల కాబోతున్న సందర్భంగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో ఈ ప్రస్తావన తేవడంతో ఓపెన్ గా మాట్లాడారు. జాన్వీ కపూర్ కెరీర్ ఇంకా ఊపందుకోవాల్సిన టైంలో పెళ్లి గురించి వార్తలు వస్తే కెరీర్ కు ఇబ్బందనే ఉద్దేశంతో ఆయన నర్మగర్భంగా ఇలా చెప్పొచ్చేమో కానీ జాన్వీ శిఖర్ లు మాత్రం పార్టీలు ఈవెంట్లు కలిసి హాజరైన సందర్భాలు బోలెడున్న మాట వాస్తవం. ఈ ఏడాది దేవర, వచ్చే సంవత్సరం రామ్ చరణ్ 16తో జాన్వీ తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది
This post was last modified on April 1, 2024 4:35 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…