రంగస్థలం.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. కంటెంట్ పరంగా క్లాసిక్ అనిపించడమే కాదు.. కమర్షియల్‌గానూ తిరుగులేని విజయాన్నందుకుని ఆ టైంకి నాన్ బాహుబలి హిట్‌గా నిలిచిందీ సినిమా. మళ్లీ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఇదిగో అదిగో అనుకుంటూ ఎట్టకేలకు ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు ముంగిట ఈ సినిమాను అనౌన్స్ చేశారు. రంగస్థలం నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కథ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ గురించి గతంలో తనకు చరణ్ చెప్పాడంటూ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం వైరల్ అయింది. రాజమౌళికే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన సీక్వెన్స్ అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు.
ఒక్క ఎపిసోడే ఆ రేంజిలో ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని చర్చించుకున్నారు జనాలు. ఐతే అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఇప్పటిదాకా కథ అయితే ఏమీ అనుకోలేదట. సుకుమార్ గతంలో ఒక ఇంట్రో సీక్వెన్స్ మాత్రమే చరణ్‌కు చెప్పాడు. అప్పటికి కూడా కథంటూ ఏమీ అనుకోలేదు. సుకుమార్‌ను దగ్గరగా చూసిన వాళ్లకు ఆయన వ్యవహారం గురించి బాగా ఐడియా ఉంటుంది. ఆయన కథ సహా ఏ విషయానికీ ఫిక్స్ అయి ఉండరు. మొదట ఐడియా అనుకున్న సమయానికి.. సినిమా మేకింగ్ టైంకి పూర్తి భిన్నంగా ఉంటుంది. సుదీర్ఘ కసరత్తు చేసి కథను ఒక కొలిక్కి తెచ్చినా.. షూటింగ్ టైంకి మళ్లీ మార్పులు చేసేస్తారు. దేనికీ ఒక పట్టాన సంతృప్తి చెందని మనిషి ఆయన.
చరణ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి మూవీ అనౌన్స్‌మెంట్ మాత్రమే జరిగింది. ఏ కథా అనుకోలేదు. ‘పుష్ప-2’ రిలీజైన కొంత కాలానికి స్క్రిప్టు పనులు మొదలవుతాయి. అప్పుడు రకరకాల ఐడియాలు అనుకుని అందులోంచి ఒకటి సెలక్ట్ చేసి దాని మీద టీంతో సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ముందు అనుకున్న సీక్వెన్స్ ఆ కథలో సింక్ అయితేనే ఉంటుంది. లేదంటే ఇంకో కొత్త మెరుపు లాంటి ఇంట్రో సీక్వెన్స్ రెడీ చేస్తారు. కాబట్టి ఇప్పుడే ఏదీ ఫిక్స్ అయిపోవడానికి లేదు.
This post was last modified on April 1, 2024 1:50 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…