Movie News

టిల్లు స్క్వేర్ – కలెక్షన్ల ఫైర్

బహుశా విడుదలకు ముందు టీమ్ ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలనుకున్నారేమో కానీ టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ ని కమ్మేస్తున్నాడు. ముఖ్యంగా నిన్న దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో వసూళ్లను హోరెత్తించాడు. మండిపోయే ఎండల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు రావడం స్టార్ హీరోలకు మాత్రమే జరుగుతుంది. అలాంటిది సిద్దు జొన్నలగడ్డ ఈ రేంజ్ లో జనాన్ని రప్పించడం చిన్న విషయం కాదు. ఈవెనింగ్ షోలే కాదు మ్యాట్నీలు సైతం వేరే సినిమాలు ఆడుతున్న స్క్రీన్లను తీసుకుని మరీ సర్దుబాటు చేసేంత రేంజ్ లో వసూళ్ల వర్షం కురిసింది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వీకెండ్ పూర్తయ్యేలోపు టిల్లు స్క్వేర్ 45 నుంచి 55 కోట్ల మధ్యలో వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాడు. నిర్మాణ సంస్థ అధికార ప్రకటన ఇంకా రాలేదు. యుఎస్ లో 2 మిలియన్ మార్క్ కు అతి దగ్గరలో ఉన్న టిల్లు స్క్వేర్ ఆ లాంఛనాన్ని ఇవాళ పూర్తి చేయడం ఖాయం. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినదాని కన్నా ఎక్కువే ఉంది. మాములుగా వీకెండ్ డ్రాప్ సహజమే. దానికి భిన్నంగా మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావడం ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఫుల్ జోష్ ఇచ్చిన సినిమా ఏదీ లేని లోటుని టిల్లు స్క్వేర్ పూర్తిగా తీరుస్తోంది.

ఇక మొదటి వారం ఆధిపత్యం తేలిపోయింది కాబట్టి ఏప్రిల్ 5 శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చాక దాని టాక్ ని బట్టి టిల్లు స్క్వేర్ కొంత తగ్గడం పెరగడం ఆధారపడి ఉంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వల్ల సరిపడా థియేటర్లు దొరకనున్నాయి. టిల్లు స్క్వేర్ ని రెండో వారంలో అధిక శాతం స్క్రీన్లలో కొనసాగించేందుకు పంపిణీదారులు సుముఖంగా ఉండటం ప్లస్ పాయింట్. టైర్ 2 హీరోల పేరు మీద ఉన్న అధిక శాతం రికార్డులు టిల్లు స్క్వేర్ కొల్లగొట్టేలానే ఉన్నాడు.

This post was last modified on April 1, 2024 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

15 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

40 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

4 hours ago