Categories: Movie News

బాలయ్య 110 ఇంకొంచెం ఆలస్యమా 

మొన్నటిదాకా ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శీను కలయికలో రూపొందే సినిమా ఓపెనింగ్ నిన్న జరిగిపోవాలి. కానీ అవ్వలేదు. 14 రీల్స్ బ్యానర్ తో పాటు మరొక నిర్మాణ సంస్థ  భాగస్వామ్యం ఇందులో ఉంటుందనే టాక్ ఉంది కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లకు కేవలం 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. టిడిపి జనసేన బిజెపి పొత్తుకు సానుకూల వాతావరణం ఉండటంతో వీలైనంత ప్రజల్లో ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకుని షూటింగులకు బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది. 

వచ్చే వారం ఉగాది పండగ సందర్భంగా పూజా కార్యక్రమం లాంటిది జరిపే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అయితే కొన్ని నెలల క్రితం బోయపాటి శీనుతో అల్లు అరవింద్ ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. హీరో ఎవరనేది చెప్పలేదు. అందరూ అల్లు అర్జున్ అనుకున్నారు కానీ అది నిజం కాదు. పోనీ బాలయ్య అనుకుంటే ఆల్రెడీ 14 రీల్స్ కమిట్ మెంట్ ఉంది. లేదంటే ఈ రెండు బ్యానర్లు చేతులు కలుపుతాయా అంటే ఖరారుగా చెప్పలేని పరిస్థితి. కథ సిద్ధంగా ఉందని, ఫైనల్ వెర్షన్ లాక్ కాగానే బోయపాటి లొకేషన్లు, క్యాస్టింగ్ తదితర పనులు మొదలుపెడతారని ఇన్ సైడ్ న్యూస్. 

సో కొంత ఆలస్యం తప్పేలా లేదు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం కూడా బాలయ్య లేని ఎపిసోడ్లను పూర్తి చేసే పనిలో ఉంది. తక్కువ అయినా సరే వీలైనన్ని డేట్లు ఇచ్చి సహకరించాలని బాలయ్య చూస్తున్నారు కానీ అదంత సులభంగా లేదు. పవన్ కళ్యాణ్ తరహాలో బ్రేక్ తీసుకోక తప్పదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరస బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య మార్కెట్ గణనీయంగా పెరిగింది. సీనియర్ హీరోల్లో ప్రస్తుత ట్రెండ్ లో విజయాల శాతం ఎక్కువగా ఉన్నది బాలయ్యకే. అందుకే జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు.  

This post was last modified on April 1, 2024 10:22 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

3 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

14 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago