కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా కొత్త దర్శకులతోనే పని చేస్తూ వచ్చాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులుతో తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగ అతడి కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పారు. అలాంటిది ఇప్పుడు కొత్త దర్శకులకు నో ఛాన్స్ అని విజయ్ దేవరకొండ అంటుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఫ్యామిలీ స్టార్ తమిళ వెర్షన్ ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన విజయ్.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో డెబ్యూ డైరెక్టర్ల గురించి మాట్లాడాడు. మీరు తమిళం నుంచి కొత్త దర్శకులకు అవకాశమిస్తారా అని అడిగితే.. ప్రస్తుతం తాను డెబ్యూ డైరెక్టర్ల గురించి ఆలోచించట్లేదని చెప్పాడు. కొత్త దర్శకులు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయడం కష్టమని.. అందుకే తాను కొంచెం అనుభవం ఉన్న దర్శకుల వైపు చూస్తున్నానని విజయ్ తెలిపాడు.
ఒక్క సినిమా అనుభవం ఉన్నా చాలు, తాను పని చేయడానికి రెడీ అని.. ఆ దర్శకుడు తీసిన సినిమాను పరిశీలించి.. తన మ్యూజిక్ సెన్స్, ఎడిట్ సెన్స్ లాంటివి చూసి పని చేయడానికి రెడీ అవుతానని విజయ్ తెలిపాడు. ఒక దర్శకుడు తీసిన తొలి చిత్రం ఫెయిలైనా పర్వాలేదని.. తన పనితనం నచ్చితే సినిమా చేస్తానని విజయ్ చెప్పాడు.
నిజానికి విజయ్‌కి కొంచెం అనుభవం ఉన్న దర్శకులతోనే చేదు అనుభవాలున్నాయి. ఎంతో అనుభవజ్ఞుడైన పూరి జగన్నాథ్ తీసిన లైగర్ ఏమైందో తెలిసిందే. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డినేకాక కొత్త దర్శకుడైన రాహుల్ సంకృత్యన్ తీసిన ట్యాక్సీవాలాతోనూ విజయాన్నందుకున్నాడు. మరో డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ తీసిన డియర్ కామ్రేడ్ సరిగా ఆడకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఇలాంటి అనుభవాలున్న హీరో కొత్త దర్శకులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేయడమేంటో?
This post was last modified on March 31, 2024 11:17 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…