Categories: Movie News

అపార్థానికి గురవుతున్న విజయ్ దేవరకొండ మాటలు 

ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇకపై కొత్త దర్శకులతో చేయనని, వాళ్లకు అనుభవం లేకపోవడం వల్ల బడ్జెట్ నియంత్రణ కోల్పోయి నిర్మాతకు నష్టం వస్తుందని అన్నాడు. ఇక్కడే సోషల్ మీడియా మీమర్లు మేల్కొన్నారు. రౌడీ హీరోకు అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, రాహుల్ సంకృత్యాన్ లు గతంలో అనుభవం లేనివాళ్లేనని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సివాలాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. విజయ్ స్టేట్ మెంట్ ని పూర్తిగా సమర్ధించడమని కాదు కానీ ఇందులో పలు కోణాలు చూడాలి. 

ఏ యూత్ హీరోకైనా కెరీర్ ప్రారంభంలో ప్రత్యేకంగా ఛాయస్ ఉండదు. ఏ ఆఫర్ వచ్చినా ఒప్పుకునే స్టేజిలో ఉంటారు. అందుకే బ్యానర్, స్టోరీ మీద మాత్రమే శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. లక్కీగా విజయ్ దేవరకొండకు డెబ్యూ డైరెక్టర్లతో బ్లాక్ బస్టర్లు పడి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అలా అని ప్రతిసారి ఇదే ఫలితం రాలేదు. టాక్సివాలా రిటర్న్స్ పరంగా సేఫ్ అయ్యి జస్ట్ హిట్ అనిపించుకుంది. డియర్ కామ్రేడ్ కు బడ్జెట్ దాటిపోయేలా చేయడంలో కొత్త దర్శకుడు భరత్ కమ్మ బాధ్యతని విస్మరించలేం. ఇంతా చేసి ఆ మూవీ సక్సెస్ కాలేదు. ఆన్ లైన్ లో క్లాసిక్ అనిపించుకోవడం తప్ప. 

అనుభవమున్న దర్శకులతోనూ విజయ్ కు ఎదురు దెబ్బలున్నాయి. లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి, నోటాలను డీల్ చేసింది ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్లే. కానీ వర్కౌట్ కాలేదుగా. కాకపొతే ఇప్పుడు తన మార్కెట్ లో వచ్చిన మార్పుల దృష్ట్యా, ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ ని పరిగణనలోకి తీసుకుని కొత్తవాళ్లతో వద్దనే అర్థమే ఇక్కడ చూడాలి తప్పించి అసలు వాళ్ళు ఉపయోగపడరని కాదు. ఫ్యామిలీ స్టార్ మీద కొండంత ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకి ఇది ఘనవిజయం సాధించడం అవసరం. ఇది గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హైప్ కి ఉపయోగపడుతుంది. 

Share

Recent Posts

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

32 minutes ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

2 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

3 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago